Unstoppable With NBK : బాలయ్య సూపర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ..

అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

Unstoppable With NBK : బాలయ్య సూపర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ..

Balakrishna Unstoppable With NBK Season 3 Announce by AHA

Unstoppable With NBK : ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సీజన్ 1, సీజన్ 2 రెండూ కూడా 20 ఎపిసోడ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. టాక్ షోలలో ఏ ఓటీటీకి రాని వ్యూస్, రికార్డులు బాలయ్య సృష్టించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అన్‌స్టాపబుల్ విత్ NBK షోకి ఎవరూ ఊహించలేనివిధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని.. ఇలా చాలామంది స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు వచ్చి అభిమానులకు ఫుల్ సంతోషాన్ని ఇచ్చారు. ఇక ఈ షోకి సీజన్ 3 కూడా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది.

గత అన్‌స్టాపబుల్ స్పెషల్ మూమెంట్స్ తో ఓ వీడియోని షేర్ చేసి.. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ మళ్ళీ రానుంది. అన్‌స్టాపబుల్ విత్ NBK రానుంది. కానీ ఈ సారి లిమిటెడ్ ఎడిషన్ తో మాత్రమే అని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వొచ్చని తెలుస్తుంది. కాకపోతే ఈ సారి 10 ఎపిసోడ్స్ కాకుండా తక్కువ ఎపిసోడ్స్ ఉండొచ్చని ఆహా చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది.

Also Read : Vijay : చిరంజీవి ఇంద్ర వీణ స్టెప్ కాపీ కొట్టిన తమిళ్ హీరో విజయ్.. ఈ సాంగ్ చూశారా?

అలాగే ఎప్పట్నుంచో ఈ షోకి చిరంజీవి వస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సీజన్ లో అయినా బాలయ్య మెగాస్టార్ కలిసి కనిపిస్తారేమో చూడాలి. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల బట్టి పలువురు రాజకీయ నాయకులు కూడా రావొచ్చేమో అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు అభిమానులు, నెటిజన్లు.