Vinayaka Temple : తొండం లేని వినాయకుడు, ఎలుకల చెవిలో చెబితే కోరికలు తీర్చే గర్ గణేష్ దేవాలయం

తొండం లేని వినాయకుడు. ఎలుకల చెవిలో చెబితే కోరికలు తీర్చే గర్ గణేష్ దేవాలయానికి వెళ్లాలంటే కొండలు ఎక్కాల్సిందే. వందల కొద్దీ మెట్లు ఎక్కితేనే తొండంలేని వినాయకుడు దర్శనమిస్తాడు. తన వాహనమైన ఎలుకల ద్వారా స్వామికి భక్తులు తమ కోరికలు చెప్పుకునే వింత ఆలయం.

Vinayaka Temple : తొండం లేని వినాయకుడు, ఎలుకల చెవిలో చెబితే కోరికలు తీర్చే గర్ గణేష్ దేవాలయం

without trunk lord garh ganesha temple

without trunk lord garh ganesha temple : విఘ్నాలను తొలగించే వినాయకుడు. తొలిపూజలు అందుకే గణనాధుడు. ఎన్ని పేర్లతో కొలిచినా భక్తుల కోర్కెలు తీర్చే లంబోధరుడు. గణపతి పప్పా మోరియా అంటే భక్తుల కోరికల్ని తీర్చే నాయకుడు. అటువంటి వినాయకుడు అంటే మనకు గుర్తు కొచ్చేది పెద్ద బొజ్జ .. దానికంటే ముందుగా తొండం. వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమప్రద అని కొలుస్తాం.

వినాయకుడి తొండం ఉండే ఆకృతిలో ఎన్నో అర్థాలున్నాయంటారు. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి’ అని.. తొండం లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి’ అని అంటారు. ఇక తొండం ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయరాదని చెపుతున్నారు పండితులు. వినాయశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. గణేషుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహలను కేవలం గుడిలో మాత్రమే ఏర్పాటు చేస్తారు.

Also Read: సహజ సిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి .. ఏడాదికి ఒకసారే దర్శనం

ఇలా గణపతి అంటే తొండం ఏదోవైపు తిరిగి ఉంటుంది. కానీ అసలు తొండమే లేని గణేశుడిని ఊహించలేం. అసలు అలాంటి గణపతి ఉంటాడని కూడా చాలామందికి తెలియదు. కానీ అలా తొండమే లేని గణపతి ఆలయం ఒకటి ఉంది మన భారతదేశం. ఈ దేవాలయానికి చాలా చరిత్ర కూడా ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయంలో తొండం లేదని గణపతి ఫోటోలను 3 వందల ఏళ్ల వరకు బయటకు రానివ్వలేదు.ఈ గణపయ్యను దర్శించుకోవాలంటే 365 మెట్లు ఎక్కాల్సిందే.

జైపూర్‌లో ఉంది ఈ తొండం లేని లేని గణేశుడి దేవాలయం. ఆరావళి పర్వతం మీద కొలువైన ఈ ఆలయం గర్ గణేష్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి వినాయక చవితి రోజున ఈ తొండం లేని వినాయకుడిని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఆ రోజు దర్శనానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.

18వ శతాబ్దంలో జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి అశ్వమేధ యాగం నిర్వహించి గర్ గణేష్ ఆలయాన్ని స్థాపించారు. గర్ గణేశుడి కళ్ళు చెక్కుచెదరకుండా ఉండటానికి.. ఆయన ఆశీర్వాదం అంతా ఎప్పుడు జైపూర్‌పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉండే విధంగా ప్రతిష్టించారట.

Also Read: శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ .. అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం..

ఈ ఆలయంలో ఫోటోలు తీసుకోవటం నిషేధం. ఎట్టి పరిస్థితుల్లోను అనుమతి ఉండదు. ఆఖరికి ఈ తొండం లేదని వినాయకుడి ఫోటోను కూడా ఎవ్వరు చూడకపోవటానికి కారణం అత్యంత కఠినంగా ఈ నిబంధనలు పాటించటమే కాదు.అందుకే 300 ఏళ్లుగా గణేశుడి ఫోటోను బయటపడలేదు. ఆలయ నిర్వాహకులు కూడా బయటపెట్టలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాలలో ఆలయంలో రాజు సిటీ ప్యాలెస్ నుండి నిలబడి హారతి దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించటం మరో విశేషం.

కొండపై ఉన్న గర్ గణేష్, గోవింద్ దేవ్ టెంపుల్, సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్ ఒకదానికొకటి సమాంతరంగా ఒకే దిశలో ఉంటాయి. దూరం నుంచి చూసినా కనిపించేలా నిర్మించారు. ఇక్కడికొచ్చే భక్తులు తమ కోరికలను చిట్టీల్లో రాసి ఆయన పాదాల దగ్గర ఉంచుతారు. అంతేకాదు ఈ ఆలయంలో ఎక్కడా లేని మరో ప్రత్యేకత ఉంది. ఆలయ ప్రాంగణంలో మెట్లు ఎక్కిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద రెండు ఎలుకలను అమర్చారు. భక్తులు ఎలుకల చెవుల్లోకి తమ కోరికలు చెప్పుకుంటారు. ఎలుకలు ఆ కోరికలను గణేశుడికి తెలియజేస్తాడట. అలా స్వామివారికి చేరిన కోరికలను ఆయన నెరవేరుస్తాడట. తమ కోరికలను నెరవేర్చాలని కోరటంతో పాటు భక్తులు ఆలయానికి వరుసగా ఏడు బుధవారాలు వచ్చి దర్శించుకుంటారు. అలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.