Navaratri 2023 : జ్ఞాన సంపద ప్రసాదించే చదువుల తల్లి ‘శ్రీ సరస్వతీ దేవి’

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

Navaratri 2023 : జ్ఞాన సంపద ప్రసాదించే చదువుల తల్లి ‘శ్రీ సరస్వతీ దేవి’

Navaratri 2023

Navaratri 2023 : నవరాత్రుల్లో ఆరవరోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఈరోజున అమ్మవారిని కొలిస్తే విద్యా ప్రాప్తి,  అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

సరస్వతి శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణంలో సరస్వతీ దేవి గురించి పలు గాధలు ఉన్నాయి. సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెబుతారు. పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. సరస్వతీ అమ్మవారిని పూజిస్తే వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం సిద్ధిస్తాయి.

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు

నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించడం మహా భాగ్యమని భక్తులు నమ్ముతారు. ఈరోజు అమ్మవారు తెలుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి గులాబీలు, తెల్ల చామంతులతో పూజ చేస్తారు. కట్టె పొంగలితో నైవేద్యం పెడతారు. ఈ రోజు సరస్వతి స్తోత్ర పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈ రోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరస్వతీ దేవి జ్ఞానాన్ని అందించే అమ్మవారు. వ్యాసుడు, కాళిదాసు వంటివారు ఈ తల్లి అనుగ్రహంతో గొప్పవారయ్యారు. విద్యార్ధులు నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే విజయాలు సాధిస్తారు.