Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి.. ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ.. ఎనిమిది కోట్లకు హక్కులు ఇచ్చారన్న..

వరుణ్ లావణ్య పెళ్లి వీడియోని మెగా ఫ్యామిలీ ఓటీటీకి అమ్ముకుంటుంది అంటూ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటి పై మెగా టీం..

Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి.. ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ.. ఎనిమిది కోట్లకు హక్కులు ఇచ్చారన్న..

Varun Tej Lavanya Tripathi Wedding Video OTT streaming news Mega team clarity

Varun Lavanya : దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటలీలో ఈ మెగా వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలో.. మెగా ఫ్యామిలీ, పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సందడిగా సాగింది. నవంబర్ 1న హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లి తంతు ఫోటోలు, వీడియోలు పెద్దగా బయటకి రాలేదు. అయితే ఈ పెళ్లి వీడియోని మెగా ఫ్యామిలీ ఓటీటీకి అమ్ముకుంటుంది అంటూ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోలను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీ సంస్థలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే బాటలో వరుణ్ లావణ్య కూడా వెళ్తున్నట్లు, నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఈ పెళ్లి వీడియో హక్కులను దాదాపు ఎనిమిది కోట్లకు అమ్మినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు మెగా ఫ్యామిలీ వరకు చేరుకున్నాయి. దీంతో మెగా టీం నుంచి దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఓటీటీకి పెళ్లి వీడియో ఇస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేసారు.

Also read :Rashmika Mandanna : రష్మిక మార్ఫింగ్ వీడియో తర్వాత సోషల్ మీడియా వేదికలకు చట్టపరమైన సూచనలు చేసిన కేంద్రం

వరుణ్ లావణ్య పెళ్లి వీడియోని ఏ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కి ఇవ్వలేదని, ఆ వార్తలు అన్ని ఫేక్ అని మెగా టీం తెలియజేసింది. దీంతో ఆ వార్తలు చెక్ పడింది. కాగా ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్ లో ఇండస్ట్రీ వ్యక్తుల కోసం, అభిమానుల కోసం ఆదివారం నాడు ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్ కి పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు. ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)