Buggana Rajendranath : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన

సామాన్య ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని తమపై బురద చల్లుతున్నారని తెలిపారు.

Buggana Rajendranath : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన

Buggana Rajendranath

Buggana Rajendranath – TDP : మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. చంద్రబాబు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ క్రియేట్ చేసి స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.241 కోట్లు దోచుకుందెవరని ప్రశ్నించారు. రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరని నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరని అడిగారు. టీడీపీ దోపిడి గురించి మాట్లాడడం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు.

Nara Lokesh : నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

సామాన్య ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని తమపై బురద చల్లుతున్నారని తెలిపారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అనేది ముమ్మాటికీ అబద్ధం అన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ కాదని మొత్తం బాధ్యత మేఘా సంస్థదేనని స్పష్టం చేశారు.

బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని తెలపారు. వడ్డీ, అసలు చెల్లించే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. లోన్ చెల్లింపులకి సంబంధించి రీ-కోర్స్ అనేది ముమ్మాటికి ఆ ప్రైవేట్ సంస్థదేనని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం మెగా సంస్థకు ఇచ్చిన పర్మిషన్ గవర్నమెంట్ గ్యారంటీ కాదన్నారు.

Palnadu : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన బంధువులు

బ్యాంక్ లు ఆ ప్రైవేట్ సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించారు. కుదిరితే వాటిని ఏ సమయంలో చెల్లించడం జరుగుతుందో సూచించామని తెలిపారు. మేఘా సంస్థకు ఇచ్చింది ప్రభుత్వ గ్యారంటీ కానే కాదన్నారు.

ఈ ఒక్క అనుమతి కూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిందని పేర్కొన్నారు. అందులోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.