PM Modi : కామారెడ్డిలో కమలనాధుల సభ .. ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి

కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

PM Modi : కామారెడ్డిలో కమలనాధుల సభ .. ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి

Narendra Modi

pm modi kamareddy meeting : కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్, టీపీసీసీ చీఫ్ ఎన్నికల బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ మూడు రోజులు తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ కామారెడ్డిలో సభకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రధాని మోదీ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పై కూడా విమర్శలు సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ వ్యూహాత్మకంగానే కామారెడ్డిలో సభ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కామారెడ్డిలో బీజేపీ తరపు నుంచి వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

మూడు రోజులు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ మూడు రోజుల్లో.. ఆరు సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈక్రమంలో 25న కామారెడ్డిలో ప్రధాని మోదీ సభపై ఆసక్తి నెలకొంది.

కాగా.. తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుంటంతో ఏపార్టీకి ఆ పార్టీయే ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు రసవత్తరంగా కొసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న క్రమంలో ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. మరోపక్క కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ బరిలో దిగటంతో మరింత హీటెక్కింది. కేసీఆర్ పై పోటీకి రేవంత్ సై అనటమే కాదు కేసీఆర్ కామారెడ్డికే కాదు శంకరగిరి మాన్యాలకు పోయినా కేసీఆర్‌ను ప్రజలు ఓడించడం ఖాయం అని..కాంగ్రెస్ అధికారం చేపట్టం ఖాయం అని ధీమాగా ఉన్నారు.

Also Read: గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది?

కానీ బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టినట్లేనని అంటోంది. కేసీఆర్ విజయపరంపరలో ఆయనమీద పోటీ చేసేవారు కొట్టుకుకోవటం ఖాయమంటోంది. ఇదిలా ఉంటే కామారెడ్డిపై కమలదళం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికి కారణం..అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డిలు పోటీలో ఉండటం.దీంతో తమ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని గెలిపించుకునేందుకు ఏకంగా ప్రధాని మోదీ పాల్గొనేలా సభను కూడా ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మరి ఈ సభలో పాల్గొననున్న మోదీ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ లపై ఎలా విరుచుకుపడనున్నారు.. అనే విషయం ఆసక్తికరంగా మారింది.