Animal Trailer : రణబీర్ కపూర్ ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది..

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ ట్రైలర్ వచ్చేసింది.

Animal Trailer : రణబీర్ కపూర్ ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది..

Ranbir Kapoor Rashmika Mandanna Animal movie trailer released

Animal Trailer : అర్జున్ రెడ్డి వంటి సంచలన మూవీ తరువాత సందీప్ వంగా నుంచి వస్తున్న మూవీ ‘యానిమల్’. అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ర‌న్ టైమ్ విషయానికి వస్తే 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లు అంటూ ద‌ర్శ‌కుడు తెలియ‌జేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని 3 నిమిషాల లాంగ్ నిడివితోనే రిలీజ్ చేశారు.

Also read : Vichithra : నటి విచిత్రకి వేధింపులు.. ఆ హీరో గురించి బిగ్‌బాస్‌లో కమల్ మాట్లాడతారా?

ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా మొత్తం హిందీ యాక్టర్స్ తోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ తో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మూవీతో సందీప్ వంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.