Edward James : భార్య మీద ప్రేమతో ఆ కవిగారు ఏం చేసారంటే.. భార్య పాదముద్రల్ని

ప్రపంచ చరిత్రలో ప్రేమ కోసం అనేకమంది త్యాగాలు చేశారు. వారి ప్రేమ గుర్తులు పంచుకున్నారు. ఓ కవి తన భార్య మీద ప్రేమతో ఏం చేశాడంటే?

Edward James : భార్య మీద ప్రేమతో ఆ కవిగారు ఏం చేసారంటే.. భార్య పాదముద్రల్ని

Edward James

Edward James : భార్య ముంతాజ్ మీద ప్రేమతో షాజహాన్ తాజమహల్ కట్టించాడని చెప్పుకుంటాం. అలాగే ఓ బ్రిటీష్ కవి భార్య మీద ప్రేమతో ఏం చేశాడంటే? చదవండి.

Edward James

Edward James

ప్రేమ అనే టాపిక్ వస్తే చాలు ఖచ్చితంగా తాజ్ మహల్ గురించి మాట్లాడుకుంటాం. ప్రేమకు అద్భుతమైన చిహ్నంగా దానిని భావిస్తాం. చరిత్రలో అనేకమంది తాము ప్రేమించిన వారి కోసం ఎన్నో విలువైన వస్తువులు ఇచ్చి ఉంటారు. బ్రిటిష్ కవి ఎడ్వర్డ్ జేమ్స్ తన భార్య కోసం ఏం చేశాడో వింటే ఔరా అంటారు. మెట్లపై ఆమె నడిచిన పాద ముద్రలను ఆర్ట్‌గా మార్చేశాడు.

International Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

దివంగత బ్రిటిష్ కవి ఎడ్వర్డ్ జేమ్స్ కళకి కొత్త రూపం ఇచ్చాడు. తన భార్య, డ్యాన్సర్ అయిన టిల్లీ లోష్‌తో గడిపిన క్షణాల్ని ఇంగ్లాండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌లోని మాంక్టన్ హౌస్‌లో శాశ్వతంగా పదిలిపరుచుకున్నారు. ఇంతకీ అతనేం చేశాడంటే? టిల్లీ తడి కాళ్లతో మెట్లపై వెళ్తున్న సందర్భంలో ఆమె పాదముద్రలను చూసి చలించిపోయాడట. అవి నిలిచి ఉండేవి కొద్దిసేపైనా వాటి గుర్తుల్ని శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు. అంతే ఆమె పాదముద్రలు మెట్లపై అలంకరించే కార్పెట్‌లో ఉండేలా ఏర్పాటు చేశాడు. అప్పటి ఆ ముద్రలు అలా శాశ్వతంగా నిలిచి ఆ గుర్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigest Tip : రూ. 600లు బిల్‌కు రూ.6లక్షలు టిప్ ఇచ్చిన మహిళ .. తర్వాత తన డబ్బు ఇచ్చేయాలంటూ పోరాటం

conxfession అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన ఫోటోల్లో టిల్లీ లోష్ పాద ముద్రల ఆర్ట్ మనకి కనిపిస్తుంది. అంతేకాదు ఎడ్వర్డ్ జేమ్స్‌కు ఆమెపై ఉన్న ప్రేమ తాలుకూ జ్ఞాపకాల గుర్తు చేస్తుంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్నమైన స్పందనలు తెలిపారు.