PM Modi : భారతీయ ప్రముఖులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi : భారతీయ ప్రముఖులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi Mann Ki Baat

PM Modi Mann Ki Baat : ‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మన్ కీ బాత్ తో కీలక అంశాలు ప్రస్తావిస్తు ప్రధాని మాట్లాడుతుంటారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆదివారం (నవంబర్ 26,2023) మన్ కీ బాత్ లో మాట్లాడుతు..ఇటీవల కాలంలో భారత్ కు చెందిన ప్రముఖులు విదేశాల్లో వివాహాలు చేసుకోవటంపై ఆందోళన వ్యక్తంచేశారు.

దేశంలోని డబ్బు దేశంలోనే ఉండేలా భారత్ గడ్డపై వివాహాలు వంటి వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే వేడుకల కోసం చేసే షాపింగ్ లో భారత్ లో తయారైన ఉత్తత్పులు వాడేలా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్లు సీజన్ మొదలు కావటంతో ప్రధాని మన్ కీ బాత్ లో ఈ అంశాలను ప్రస్తావించారు. భారతీయులు భారత్ లోనే వివాహాలు వంటి వేడుకలు చేసుకుంటే దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉంటుందని అన్నారు. ఇలా చేస్తే మన డబ్బు మన వద్దే ఉంటుందని  ప్రధాని ఆకాంక్షించారు.

కాగా..భారత్ లో వివాహాల సీజన్ లో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. అది నగలు, బట్టలు, వేడుకలకు కావాల్సిన వస్తువులు కొనుగోలు వంటివాటిలో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటుంది. అలా ఈ ఏడాది తాజాగా ఈ పెళ్లిళ్ల సీజన లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో పెళ్లిళ్లు వంటి వేడుకలు షాపింగ్ చేసే సయమంలో భారతీయ ఉత్పత్తులను వినియోగిస్తే తద్వారా అయ్యే ఖర్చు దానికి సంబంధించిన పన్ను వంటివి భారత్ కే చెందుతాయి. ఇదే ఉద్ధేశాన్ని ప్రధాని మోదీ భావించారు.

Also Read : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

ఈ అంశాన్ని ప్రస్తావిస్తు.. “అవును..పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుండి..చాలా కాలంగా ఒక విషయం నన్ను కలవరపెడుతోంది … ఈ ఆవేదనను నా కుటుంబ సభ్యులకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను..ఒక్కసారి ఆలోచించండి… ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునేందుకు కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా?” అని అన్నారు ప్రధాని మోదీ.

ఇలాంటి పెళ్లిళ్లలో దేశ ప్రజలకు ఏదో విధంగా సేవ చేసే అవకాశం లభిస్తుందని సూచిస్తున్నాను అని అన్నారు.కాకపోతే..మీకు కావాల్సిన ప్రస్తుతం అందుబాటులో ఉండకపోవచ్చు…కానీ ఇటువంటి వేడుకలు ఇక్కడే నిర్వహించుకుంటుంటు ఉంటే అవి అభివృద్ది చెందుతాయి..ఇది ముఖ్యంగా ప్రముఖుల కుటుంబాలకు నా ఆవేదన, బాధవారికి చేరుతుందనే అనుకుంటున్నా’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

దేశ నిర్మాణ బాధ్యతలను ప్రజలు తీసుకున్నప్పుడు..ఆ దేశాన్ని ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ లో 140 కోట్ల మంది ప్రజలు అనేక పరివర్తనలకు నాయకత్వం వహిస్తున్నారు..అది ప్రస్తుతం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది అని ఈ సందర్బంగా ఆయన అన్నారు. దేశంలో పండుగలు వంటివి వస్తే వ్యాపారం విస్తారంగా జరుగుతోంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దీపావళి, భయ్యా దూజ్, ఛత్ వేడుల సమయంలో దేశంలో కోటి రూపాయల వ్యాపారం జరిగిందని అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారని దానిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read : హిందూ రాష్ట్రం ఏర్పడిందట.. యువతతో మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు

మన పిల్లలు కూడా షాప్‌లో ఏదైనా కొంటున్నప్పుడు..వాటిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉందా లేదా అని చూసి మరీ కొంటున్నారని ఇది చాలా శుభపరిణామం అని అన్నారు. అంతేకాదు..ప్రజలు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పుట్టిన దేశాన్ని చెక్ చేసి కొనటం మర్చిపోరని అన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ విజయం స్ఫూర్తిగా మారుతున్నట్లే..’వోకల్ ఫర్ లోకల్’ విజయం ‘అభివృద్ధి చెందిన భారత్- సంపన్న భారత్’కు తలుపులు తెరుస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్బంగా తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే ఈ ప్రచారం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.