Nani : విజయ్ – రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని.. క్షమాపణలు కూడా చెప్తూ..

రష్మిక- విజయ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇలా పబ్లిక్ గా ఇంకొకరి ఈవెంట్లో ప్రైవేట్ ఫోటోలు వేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై నాని స్పందించారు.

Nani : విజయ్ – రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని.. క్షమాపణలు కూడా చెప్తూ..

Nani Reacts on Vijay Rashmika Photo issue in Hi Nanna Movie Pre Release Event

Nani : టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నాని ఇండస్ట్రీలోకి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. తమకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ ఓ క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమా ఈవెంట్స్ లో విజయ్ ని అవమానించారని ఇప్పటికి విజయ్ ఫ్యాన్స్ నానిపై కోపంగా ఉంటారు. ఆ తర్వాత విజయ్ నాని రేంజ్ దాటేసి ఎదగడంతో నాని ఫ్యాన్స్ విజయ్ పై దొరికినప్పుడల్లా ట్రోల్స్ చేస్తున్నారు. నాని – విజయ్ దేవరకొండ మధ్యలో ఏం లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు.

నాని త్వరలో ‘హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. కొన్ని మీమ్స్, కొన్ని ఫొటోస్ చూపించి నాని, మృణాల్ ని వాటిపై కామెంట్స్ చెప్పామన్నారు. అయితే ఆ ప్రోగ్రాం డిజైన్ చేసిన వాళ్ళు విజయ్ – రష్మిక(Rashmika) మాల్దీవ్స్ ఫోటో కూడా వేయడంతో దీని గురించి నానికి తెలియకపోయినా ఇది పెద్ద వివాదంగా మారింది. విజయ్ ఫ్యాన్స్ నానిపై తెగ విమర్శలు చేశారు. యాంకర్ సుమపై కూడా విమర్శలు వచ్చాయి. అసలు ఒక హీరో ఈవెంట్లో ఇంకో హీరో పర్సనల్ విషయాలు ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగింది.

రష్మిక- విజయ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇలా పబ్లిక్ గా ఇంకొకరి ఈవెంట్లో ప్రైవేట్ ఫోటోలు వేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై నాని స్పందించారు. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ – రష్మిక ఫోటో వివాదంపై స్పందించారు.

Also Read : Vijay Deverakonda : నానిపై మండిపడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఇంత చీప్‌గా చేస్తారా..

నాని మాట్లాడుతూ.. హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ – రష్మికల ఫోటో అలా స్క్రీన్ పై వేయడం నిజంగా దురదృష్టకరం. ఆ ఫోటో చూసి మేము కూడా షాక్ అయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం చాలా మంది వర్క్ చేస్తారు. అది ఎవరు చేసారో కూడా తెలీదు, వాళ్ళు ఎందుకు చేసారో కూడా తెలీదు. నేను, విజయ్, రష్మిక.. మేమంతా మంచి స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్ లో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకి కూడా తెలుసు. ఒకవేళ ఆ చర్య వాళ్ళ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ‘హాయ్ నాన్న’ టీం నుంచి క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు. దీంతో నాని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా విజయ్ ఫ్యాన్స్ అర్ధం చేసుకొని నానిపై విమర్శలు ఆపుతారేమో చూడాలి. నాని – రష్మిక కూడా గతంలో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. ఇక నాని – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.