Vijay Deverakonda : నానిపై మండిపడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఇంత చీప్‌గా చేస్తారా..

ఇంత చీప్‌గా చేస్తారా అంటూ 'హాయ్ నాన్న' మూవీ టీం పై ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్స్. అసలు ఏమైంది..?

Vijay Deverakonda : నానిపై మండిపడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఇంత చీప్‌గా చేస్తారా..

Vijay Deverakonda fans fire on Nani Hi Nanna movie team

Updated On : November 30, 2023 / 8:50 AM IST

Vijay Deverakonda : టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నాని ఇండస్ట్రీలోకి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. తమకంటూ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. దీంతో వీరిద్దర్నీ ఒకటిగా అభిమానించే అభిమానులు చాలామందే ఉంటారు. నాని సినిమాకి విజయ్ ఫ్యాన్స్, విజయ్ సినిమాకి నాని ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుంటూ కూడా వస్తారు. అయితే ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక విషయం విజయ్ దేవరకొండ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. మరి ఇలా చీప్‌గా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. నిన్న బుధవారం నైట్ నాని ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో కొన్ని పిక్స్ చూపించి దాని మీద మీ కామెంట్స్ ఏంటంటూ నాని అండ్ మృణాల్ ఠాకూర్ ని ప్రశ్నించారు. ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫోటోని చూపించి కామెంట్స్ ఏంటని ప్రశ్నించారు. ఆ ఫోటో చూసి నాని అండ్ మృణాల్ కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ ఫోటోనే వివాదం అవుతుంది. అసలు ఆ ఫోటో ఏంటంటే.. గతంలో విజయ్ అండ్ రష్మిక తమ మాల్దీవ్ వెకేషన్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Also read : Celebrities Vote Cast : ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న సెలబ్రిటీస్.. అప్డేట్స్ ఇవే..

ఆ సమయంలో ఆ ఫోటోలను చూపిస్తూ.. విజయ్, రష్మిక జంటగా మాల్దీవ్స్ కి వెళ్లారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అయితే అవి కేవలం నెటిజెన్స్ మధ్య కామెంట్స్ గానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన నాని.. తన తోటి నటీనటుల గురించిన ఒక రూమర్ ని తన మూవీ ఫంక్షన్ వేయడం చర్చినీయాంశం అయ్యింది. ఈ విషయం పై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చీప్‌గా చేస్తారా అంటూ మూవీ టీం పై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.