Animal Movie : యానిమల్ మూవీ ఆ హీరోయిన్ చేయాల్సింది.. కానీ రష్మిక ఎంట్రీ..

యానిమల్ మూవీలో రష్మిక చేసిన పాత్ర ఆ హీరోయిన్ చేయాల్సిందట. ఎవరు ఆ భామ..

Animal Movie : యానిమల్ మూవీ ఆ హీరోయిన్ చేయాల్సింది.. కానీ రష్మిక ఎంట్రీ..

Bollywood heroine is selected for Rashmika Mandanna role in Animal Movie

Animal Movie : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న ప్రధాన కథానాయికగా కనిపించగా తృప్తి దిమ్రీ సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. అయితే రష్మిక మందన్న కంటే ముందు ఆమె పాత్రకి మరో మరో హీరోయిన్ ని సందీప్ వంగ ఎంపిక చేశారట. షూటింగ్ మొదలుపెట్టే పండెండు రోజులు ముందు వరకు కూడా మొదటి ఎంపిక చేసిన నటే యానిమల్ మూవీలో కథానాయికట. కానీ చివరిలో సందీప్ రష్మికని ఎంపిక చేశారట.

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఈ సినిమాకి హీరోయిన్ గా సైన్ చేశారట. అయితే కొన్నిరోజుల తరువాత సందీప్‌కి.. పరిణీతి చోప్రా గీతాంజలి పాత్రకి కరెక్ట్ కాదని అనిపించిందట. ఆమె బాగా నటించగలరు. కానీ ఆ పాత్రకి ఆమె కరెక్ట్ కాదన్న విషయాన్ని సందీప్, పరిణీతికి తెలియజేశాడట. పరిణీతి సైన్ చేసిన ఏడాదిన్నర తరువాత షూటింగ్ మొదలు పెట్టే పండెండు రోజుల ముందు సందీప్ ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారట. ఆమె ఈ సినిమా మిస్ చేసుకుంటునందుకు బాధపడినా.. సందీప్ నిర్ణయాన్ని గౌరవించి యానిమల్ నుంచి తప్పుకున్నారట.

Also read : Animal Movie : యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్.. ఆ స్టార్ హీరోదట..

ఈ విషయంలో సందీప్ వంగ, పరిణీతికి క్షమాపణలు తెలియజేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే తృప్తి దిమ్రీకి ఎక్కువ పేరు వస్తుంది. ఈ మూవీతో తృప్తి దిమ్రీకి యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రేజ్ తో అప్పుడే సినిమా ఛాన్స్ లు కూడా ఆమె వద్దకి చేరుతున్నాయని తెలుస్తుంది. రవితేజ నటించబోయే కొత్త సినిమాలో తృప్తి దిమ్రీని హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇక యానిమల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. వీకెండ్, వీక్ డే అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ బిగ్గెస్ట్ హిట్టుగా దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇదే స్పీడ్ కొనసాగితే ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు.