Obstructing The Field : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు ముష్ఫికర్‌ రహీం విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. ఇలా ఔటైన మొద‌టి బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Obstructing The Field : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

Mushfiqur Rahim gets out Obstructing The Field

బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు ముష్ఫికర్‌ రహీం విచిత్ర రీతిలో  ఔట్ అయ్యాడు. ఇలా ఔటైన మొద‌టి బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న రెండో టెస్టులో ముష్ఫికర్‌ రహీం అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఏం జ‌రిగిందంటే..?

ఢాకా వేదిక‌గా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు నేడు(బుధ‌వారం) ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మహ్మదుల్ హసన్ జాయ్(14), జాకీర్ హసన్ (8), నజ్ముల్ హుస్సేన్ శాంటో(9), మోమినుల్ హక్ (5) లు త్వ‌ర‌గా ఔట్ కావ‌డంతో బంగ్లాదేశ్ 47 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో సీనియ‌ర్ ఆట‌గాడు ముష్ఫికర్‌ రహీం (35), షాహదత్ హుస్సేన్ (31) తో క‌లిసి జ‌ట్టును ఆదుకున్నాడు.

Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

అప్ప‌టికే వీరిద్ద‌రు 57 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి ప్ర‌మాద‌క‌రంగా మారుతున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో ఇన్నింగ్స్ 40 వ ఓవ‌ర్‌ను కైల్ జేమిస‌న్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో నాలుగో బంతిని ర‌హీం డిఫెన్స్ ఆడాడు. బ్యాట్‌ను తాకిన బంతి కింద ప‌డి లేచింది. అయితే.. బంతి వికెట్ల వైపుకు వెలుతుంద‌ని భావించిన ర‌హీం వెంట‌నే త‌న కుడి చేతితో బాల్‌ను ప‌క్క‌కు నెట్టాడు. వెంట‌నే న్యూజిలాండ్ ఫీల్డ‌ర్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు.

ప‌లు మార్లు రిప్లైలు ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్.. ర‌హీం కావాల‌నే బంతిని అడ్డుకున్న‌ట్లు భావించాడు. దీంతో ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ ప‌రిగ‌ణిస్తూ ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ర‌హీం నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. కాగా.. బంగ్లాదేశ్ త‌రుపున టెస్టుల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధ‌న ద్వారా ఔటైన మొద‌టి బ్యాట‌ర్‌గా నిలిచాడు. వాస్త‌వానికి బంతికి వికెట్ల‌కు చాలా దూరంగానే ప‌డేది. కానీ ర‌హీం వికెట్ల వైపు వెలుతున్న భావించి ఇలా ఔటైయ్యాడు.

ర‌హీం ఔట్ కావ‌డంతో కుదురుకున్న‌ట్లుగానే క‌నిపించిన బంగ్లాదేశ్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మిచెల్ సాంట్న‌ర్‌, గ్లెన్ ఫిలిప్స్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. అజాజ్ ప‌టేల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా టిమ్ సౌథి ఓ వికెట్ సాధించాడు.

IND vs AUS : అంపైర్ల తప్పిదాల వ‌ల్ల‌నే టీమ్ఇండియా గెలిచిందా..?