Revanth Reddy’s Swearing In Ceremony: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..Revanth Reddy Takes Oath as CM of Telangana State

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు

  • జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్
  • దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతానికి కీలకంగా పనిచేసిన నేత
  • కొల్లాపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన తొలి ఎమ్మెల్యే
  • మొత్తం ఆరుసార్లు MLAగా విజయం
  • కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు

  • తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం
  • సీనియర్‌ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం
  • గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
  • ఆరుసార్లు MLA, ఒకసారి MLCగా విజయం
  • ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

  • సీతక్క @ అనసూయ, ములుగు
  • ST సామాజిక వర్గంలో బలమైన మహిళా నేత
  • రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అండదండలు
  • గతంలో 15 ఏళ్లు మావోయిస్టుగా అజ్ఞాతవాసం
  • ములుగు నుంచి మూడుసార్లు MLAగా గెలుపు
  • 2009లో తొలిసారి MLAగా విజయం
  • 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ

  • కొండా సురేఖ, వరంగల్‌ ఈస్ట్
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు
  • గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, విషయ పరిజ్ఞానం
  • ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం
  • 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా విజయం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్

  • పొన్నం ప్రభాకర్‌, హుస్నాబాద్‌
  • ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నేత
  • విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రయాణం
  • 2009లో కరీంనగర్‌ ఎంపీగా విజయం
  • తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు
  • ఖమ్మం జిల్లాలో బలమైన లీడర్
  • 2014లో ఖమ్మం ఎంపీగా గెలుపు
  • 2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
  • ఒకసారి MLA, ఒకసారి ఎంపీగా విజయం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంథని
  • తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమైన నేతల్లో ఒకరు
  • ఏఐసీసీ పెద్దలతోనూ విస్తృత సంబంధాలు
  • ఈ ఎన్నికల్లో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు
  • గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
  • మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
  • 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • నల్గొండ జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేత
  • గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
  • ఐదుసార్లు MLA, ఒకసారి ఎంపీగా విజయం
  • 1999, 2004, 09, 14, 23 ఎన్నికల్లో నల్లగొండ నుంచి విజయం
  • వైఎస్ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం
  • 2019లో భువనగిరి ఎంపీగా విజయం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ

  • దామోదర రాజనరసింహ, అందోల్
  • ఉమ్మడి ఏపీలో మాజీ ఉప ముఖ్యమంత్రి
  • దామోదర ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీకి వీరవిధేయుడిగా గుర్తింపు
  • అందోల్‌ నుంచి ఐదుసార్లు MLAగా విజయం
  • 1989, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
  • మంత్రిగా పనిచేసిన అనుభవం

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

  • ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా విజయం
  • కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ కీలక నేత

 

డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం


రేవంత్ రెడ్డి చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై

ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను…