Team India : ద‌క్షిణాఫ్రికా చేరుకున్న టీమ్ఇండియా.. ఎలాంటి స్వాగ‌తం ల‌భించిందో చూడండి.. వీడియో

India tour of South Africa : నెల‌రోజుల సుదీర్ఘ ప‌ర్య‌ట‌న కోసం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాకు చేరుకుంది.

Team India : ద‌క్షిణాఫ్రికా చేరుకున్న టీమ్ఇండియా.. ఎలాంటి స్వాగ‌తం ల‌భించిందో చూడండి.. వీడియో

Team India

నెల‌రోజుల సుదీర్ఘ ప‌ర్య‌ట‌న కోసం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాకు చేరుకుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా ఆతిథ్య ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. డిసెంబ‌ర్ 10 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో టీ20 సిరీస్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ నాయక‌త్వంలో ఆడ‌నున్న ఆట‌గాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలోని డ‌ర్బ‌న్‌కు చేరుకుంది.

టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌కు అక్క‌డ ఘ‌న స్వాగతం ల‌భించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ కెమెరా వైపు చూస్తూ హాయ్ అబ్బాయిలు, సౌతాఫ్రికాకు స్వాగ‌తం అంటూ చెప్ప‌డంతో వీడియో పూర్తి అయ్యింది. భార‌త క్రికెట‌ర్ల‌ను చూసేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా ఫోటోను పోస్ట్ చేసిన‌ ముంబై ఇండియ‌న్స్.. దేనికి సంకేతం..!

టీ20 సిరీస్.. డిసెంబ‌ర్ 10 నుంచి 14 వ‌ర‌కు..

టీ20ల‌కు భార‌త జ‌ట్టు ఇదే : యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా (వైస్‌కెప్టెన్‌), వాషింగ్టన్ సుంద‌ర్‌, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్

వ‌న్డే సిరీస్‌.. డిసెంబ‌ర్ 17 నుంచి 21 వ‌ర‌కు..

వన్డేలకు భారత జట్టు ఇదే : రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.

టెస్టు సిరీస్‌.. డిసెంబ‌ర్ 26 నుంచి జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు..

టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మ‌హ్మ‌ద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

Legends League Cricket : మ్యాచ్ మ‌ధ్య‌లో గొడ‌వ ప‌డిన గంభీర్‌, శ్రీశాంత్.. అంపైర్లు వచ్చినా ఆగ‌లేదు..!