Vasanthi Krishnan : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్బాస్ భామ.. ప్రియుడితో నిశ్చితార్థం..
సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వాసంతి గత సీజన్ బిగ్బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. తాజాగా వాసంతి నిశ్చితార్థం జరిగింది.
Vasanthi Krishnan : బిగ్బాస్(Bigg Boss) 6వ సీజన్ లో నటి వాసంతి కృష్ణన్ మంచి పేరే తెచ్చుకుంది. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వాసంతి గత సీజన్ బిగ్బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. తిరుపతి అమ్మాయి అయిన వాసంతి బెంగళూరులో ఏవియేషన్ కోర్స్ చేసి ఆ తర్వాత మోడలింగ్ లోకి వచ్చింది. కన్నడలో కొన్ని సీరియల్స్, సినిమాల్లో పాత్రలు చేసిన వాసంతి ఆ తర్వాత తెలుగులో సిరిసిరి మువ్వలు, గోరింటాకు, గుప్పెడంత మనసు.. లాంటి పలు సీరియల్స్ లలో నటించింది. పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వేసింది.
తాజాగా వాసంతి నిశ్చితార్థం జరిగింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనే నటుడితో వాసంతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇటీవల రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో తన సొంతూరు తిరుపతిలోనే వాసంతి పవన్ కళ్యాణ్ ని నిశ్చితార్థం చేసుకుంది. ఈ కార్యక్రమం ఘనంగా జరగగా పలువురు టీవీ ప్రముఖులు హాజరయి సందడి చేశారు. బిగ్బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ కూడా పలువురు ఈ నిశ్చితార్థానికి వచ్చి సందడి చేశారు.
Also Read : Mahesh Babu : రేవంత్ రెడ్డికి సూపర్ స్టార్ అభినందనలు.. స్పెషల్ ట్వీట్ తో..
ప్రస్తుతం వాసంతి నిశ్చితార్థం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు కాబోయే జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒకటి కానున్నారు.