BAN vs NZ 2nd Test : ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌.. రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై విజ‌యం..

Bangladesh vs New Zealand 2nd Test : బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌ను న్యూజిలాండ్ జ‌ట్టు విజ‌యంతో ముగించింది.

BAN vs NZ 2nd Test : ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌.. రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై విజ‌యం..

Bangladesh vs New Zealand 2nd Test

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌ను న్యూజిలాండ్ జ‌ట్టు విజ‌యంతో ముగించింది. ఢాకా వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై నాలుగు వికెట్ల తేడాతో టిమ్ సౌథీ నేతృత్వంలోని కివీస్ జ‌ట్టు విజ‌యం సాధించింది. త‌ద్వారా మొద‌టి టెస్టులో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బౌల‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్న‌ర్ లు చెరో మూడు వికెట్లు తీయ‌గా అజాజ్ ప‌టేల్ రెండు, టిమ్ సౌథీ ఓ వికెట్ సాధించాడు. అనంత‌రం గ్లెన్ ఫిలిప్స్ (87) రాణించ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 8 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం కివీస్‌కు ద‌క్కింది.

Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 144 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఓ ద‌శ‌లో రెండు వికెట్లు కోల్పోయిన 72 ప‌రుగుల‌తో ప‌టిష్టంగా క‌నిపించింది. అయితే.. స్పిన్నర్లు అజాజ్ పటేల్ (6-57), మిచెల్ సాంట్నర్ (3-51) లు రాణించ‌డంతో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కుప్ప‌కూలింది. దీంతో న్యూజిలాండ్ ముందు 136 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. అయితే.. పిచ్ స్పిన్న‌ర్లు అనుకూలిస్తున్న క్ర‌మంలో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 69 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో ఆల్‌రౌండ‌ర్లు గ్లెన్ ఫిలిప్స్ (40 నాటౌట్‌), మిచెల్ సాంట్న‌ర్‌(35 నాటౌట్‌) ను జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఏడో వికెట్‌కు అభేద్యంగా 70 ప‌రుగులు జోడించి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. కివీస్ విజ‌యం సాధించడంలో కీల‌క పాత్ర పోషించిన గ్లెన్ ఫిలిప్స్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించగా సిరీస్ ఆసాంతం రాణించిన బంగ్లాదేశ్ ఆట‌గాడు తైజుల్ ఇస్లాంకు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

AB De Villiers : కొడుకు వ‌ల్ల కంటిచూపు కోల్పోయా.. వాళ్లు చెప్ప‌డంతోనే రిటైర్మెంట్ .. ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు