WPL Auction 2024 : ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. అమ్ముడుపోయిన ప్లేయ‌ర్లు ఎవ‌రంటే..? లిస్ట్ ఇదే..

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీల్‌)కు సంబంధించి ముంబైలో శ‌నివారం నిర్వ‌హించిన మినీ వేలం ప్ర‌క్రియ ముగిసింది.

WPL Auction 2024 : ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. అమ్ముడుపోయిన ప్లేయ‌ర్లు ఎవ‌రంటే..? లిస్ట్ ఇదే..

WPL Auction 2024

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీల్‌ 2024 )కు సంబంధించి ముంబైలో శ‌నివారం నిర్వ‌హించిన మినీ వేలం ప్ర‌క్రియ ముగిసింది. 30 ఖాళీల కోసం 165 మంది ప్లేయ‌ర్లు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. వీరిలో 104 మంది భార‌తీయులు కాగా.. 61 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు.

వీరిలో అత్య‌ధికంగా గుజ‌రాత్ జెయింట్స్ 10 మంది, ఆర్‌సీబీ 7గురు, ముంబై ఇండియ‌న్స్ 5గురు, యూపీ వారియర్స్ 5గురు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముగ్గురు ప్లేయ‌ర్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్ల‌కు ద‌క్కించుకోగా, అన్‌క్యాప్‌డ్ కేటగిరీలో భారత్‌కు చెందిన కాష్వీ గౌతమ్‌ను గుజరాత్ టైటాన్స్‌లో రూ.2 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

Ajaz Patel : విచిత్ర బౌల‌ర్‌.. స్వ‌దేశంలో నో వికెట్.. కానీ విదేశాల్లో 62 వికెట్లు..! భార‌త సంత‌తి ఆట‌గాడే

ఎవ‌రిని ఏ జ‌ట్టు సొంతం చేసుకుందంటే..?

1. ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ బేస్ ప్రైజ్ రూ.40 ల‌క్ష‌లు కాగా.. రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
2. భార‌త్‌కు చెందిన కష్వీ గౌతమ్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
3. భార‌త్‌కు చెందిన వ్రిందా దినేష్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.1.3 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది
4. ద‌క్షాణాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ బేస్ ప్రైజ్ రూ.40 లక్షలు కాగా.. రూ.1.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
5. ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. గుజరాత్ జెయింట్స్ రూ.1 కోటికి సొంతం చేసుకుంది
6. భార‌త్‌కు చెందిన ఏక్తా బిష్త్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. రూ.60 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొనుగోలు చేసింది
7. ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వారేమ్ బేస్ ప్రైజ్ అయిన రూ.40 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.
8. ఇంగ్లాండ్ కు చెందిన డాని వ్యాట్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.
9. భార‌త్‌కు చెందిన వేదా కృష్ణమూర్తి బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది
10. భార‌త్‌కు చెందిన ఎస్ మేఘన బేస్ ప్రైజ్ అయిన రూ. 30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది.
11. భార‌త్‌కు చెందిన మేఘనా సింగ్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
12. భార‌త్‌కు చెందిన సిమ్రాన్ బహదూర్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

13. ఇంగ్లాండ్‌కు చెందిన కేట్ క్రాస్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.
14. భార‌త్‌కు చెందిన గౌహెర్ సుల్తానా బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యుపి వారియర్స్ దక్కించుకుంది
15. ఆస్ట్రేలియాకు చెందిన లారెన్ చీటిల్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్ష‌లకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది
16. ఆస్ట్రేలియాకు చెందిన సోపీ మోలిన్యూక్స్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది
17. భార‌త్‌కు చెందిన ఎస్ సజన బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్ రూ.15 లక్షలకు సొంతం చేసుకుంది
18. భార‌త్‌కు చెందిన ప్రియా మిశ్రా బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.15 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది
19.భార‌త్‌కు చెందిన త్రిష పూజిత బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది
20. భార‌త్‌కు చెందిన అపర్ణా మోండల్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ ద‌క్కించుకుంది.
21. భార‌త్‌కు చెందిన పూనమ్ ఖేమ్నార్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది
22. భార‌త్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్‌ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది
23. భార‌త్‌కు చెందిన సైమా థాకోర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ద్ర‌విడ్ చెప్పాడు.. నేను చేయాల్సింది చేస్తా.. : రింకూ సింగ్

24. స్కాట్లాండ్‌కు చెందిన కేథరీన్ బ్రైస్ బేస్ ప్రైజ్ అయిన రూ.10లక్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది
25. భార‌త్‌కు చెందిన మన్నత్ కశ్యప్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
26 భార‌త్‌కు చెందిన అశ్విని కుమారి బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది
27 భార‌త్‌కు చెందిన ఫాతిమా జాఫర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
28 భార‌త్‌కు చెందిన కీర్తన బాలకృష్ణన్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది
29 భార‌త్‌కు చెందిన శుభా సతీష్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది

BCCI : ఏడాదికి బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎక్కువా..? త‌క్కువా..?

30 భార‌త్‌కు చెందిన తరన్నమ్ పఠాన్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది