Allu Arjun : ‘హాయ్ నాన్న’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. మరోసారి నానిపై పొగడ్తలు..

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయ్ నాన్న సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. హాయ్ నాన్న సినిమా నచ్చడంతో చిత్రయూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Allu Arjun : ‘హాయ్ నాన్న’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. మరోసారి నానిపై పొగడ్తలు..

Allu Arjun Review and Appreciation post on Nani Hi Nanna Movie

Allu Arjun : నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న(Hi Nanna). తండ్రీకూతుళ్ళు, లవ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల డిసెంబర్ 7న రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. నాని ఈ సినిమాతో మరో విజయం సాధించాడు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు హాయ్ నాన్న సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయ్ నాన్న సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ తనకి ఏదైనా సినిమా నచ్చితే ఆ చిత్రయూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. హాయ్ నాన్న సినిమా నచ్చడంతో చిత్రయూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. హాయ్ నాన్న సినిమా యూనిట్ కి అభినందనలు. చాలా మంచి సినిమా, మనసుని హత్తుకుంది. నాని గారు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథలని బయటకి తెచ్చినందుకు మీ మీద గౌరవం పెరిగింది. మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేసింది. తన నటన కూడా తనలాగే అందంగా ఉంది. బేబీ కియారా నీ క్యూట్ నెస్ తో మా గుండెల్ని పిండేశావు. ఇంక చాలు, స్కూల్ కి వెళ్ళు. సినిమాలోని మిగిలిన ఆర్టిస్టులందరికి కంగ్రాట్స్. కెమెరామెన్ సాను వరుగేస్, సంగీత దర్శకులు హేశం అబ్దుల్ వహీద్, డైరెక్టర్ శౌర్యువ్‌ వర్క్ బాగా చేశారు. శౌర్యువ్‌ నీ మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పిస్తున్నావు. గుండెని హత్తుకునే సన్నివేశాలను ఎంతో అందంగా చూపించావు, ఇలాగే ముందుకెళ్లాలి, కంగ్రాట్స్. నిర్మాతలకు కూడా ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు కంగ్రాట్స్. హాయ్ నాన్న సినిమా కేవలం ఫాదర్స్ కి మాత్రమే కాదు ప్రతి కుటుంబాన్ని తాకుతుంది అని పోస్ట్ చేశారు.

Also Read : Goodachari 2 : మొదలైన గూఢ‌చారి 2.. ఈ సారి ఇంకో కొత్త మిషన్ తో అడివి శేష్..

దీంతో నాన్న సినిమాపై అల్లుఅర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. నాని అభిమానులు థ్యాంక్స్ చెప్తూ పోస్టులు చేస్తున్నారు. దీనికి నాని రిప్లై ఇస్తూ.. అర్హ వాళ్ళ నాన్న మెచ్చుకున్నారు. థ్యాంక్స్ బన్నీ. నువ్వు మంచి సినిమా కోసం ఎప్పుడూ ఉంటావు అని రిప్లై ఇచ్చారు. గతంలో కూడా అల్లు అర్జున్ జెర్సీ, దసరా సినిమాలకు కూడా అభినందిస్తూ ట్వీట్ చేశారు.