Karavali : కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. ‘కరావళి’.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..

ఇటీవల కన్నడ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో ఓ కొత్త కథతో ప్రజ్వల్ దేవరాజ్ కూడా పాన్ ఇండియా సినిమా ‘కరావళి’తో రాబోతున్నాడు.

Karavali : కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. ‘కరావళి’.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..

Prajwal Devaraj 40th Film Karavali Movie Promo Released

Karavali Movie : కన్నడ హీరో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్(Prajwal Devaraj) ఇప్పటివరకు పలు కన్నడ సినిమాలతో మెప్పించాడు. ఇటీవల కన్నడ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో ఓ కొత్త కథతో ప్రజ్వల్ దేవరాజ్ కూడా పాన్ ఇండియా సినిమా ‘కరావళి’తో రాబోతున్నాడు. గురుదత్త గనిగ దర్శకత్వంలో వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హీరో ప్రజ్వల్ కి 40వ సినిమా కావడం విశేషం.

ఇప్పటికే షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా. తాజాగా కరావళి సినిమా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. చూపించారు. ఇంకో వైపు మహిషానికి పూజలు చేస్తున్నట్టు చూపించారు. చివర్లో హీరో గేదె మీద మహిషావతారంలో వచ్చినట్టు చూపించి భయపెట్టారు. దీంతో ఈ సినిమా రా & రస్టిక్ గా అందబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ చూస్తుంటే హారర్, సస్పెన్స్ జోనర్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Gopichand Malineni : రవితేజ సినిమా పక్కన పెట్టి.. అదే కథతో బాలీవుడ్ కి వెళ్లిన గోపీచంద్ మలినేని?

కరావళి అనేది కర్ణాటకలోని ఓ ఏరియా. అక్కడి కన్నడ భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మూలల్లోంచి ఓ కథని తీసుకుని తెరపై ఆవిష్కరించబోతున్నట్టు దర్శక నిర్మాత గురుదత్త గనిగ తెలిపారు. టీజర్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లాగే ఈ సినిమా కూడా చీకట్లో, బ్లాక్ సినిమాటిక్ విజువల్స్ లోనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రోమోలో డైలాగ్స్ లేకుండా అన్ని భాషలకు కలిపి ఒకటే మ్యూజిక్ తో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి సచిన్ బస్రూర్ సంగీతం అందించారు. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం.