Bonda Uma : వైసీపీకి సింగిల్ డిజిట్ అని ఐ ప్యాక్ సర్వే తేల్చేసింది.. అందుకే జగన్ చేతులెత్తేశారు : బోండా ఉమ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్ లోకి వచ్చారనే వార్తలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. గతంతో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.

Bonda Uma : వైసీపీకి సింగిల్ డిజిట్ అని ఐ ప్యాక్ సర్వే తేల్చేసింది.. అందుకే జగన్ చేతులెత్తేశారు : బోండా ఉమ

Bonda Uma

Bonda Uma..YCP : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది ..వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ  టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జులను మార్చేస్తున్నారు. దీనిపై కూడా టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్‌లోకి వచ్చారనే వార్తలు ఏపీలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. గతంలో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్.. విడుదల అనంతరం పీకే టీడీపీకి టచ్ లోకి వచ్చారనే వార్తలు వస్తున్నాయి.

అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

ఇటువంటి తరుణంలో టీడీపీ నేత, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సర్వేల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని తేలిందని.. అందుకే ఎన్నికలు మూడు నెలలు ఉండగానే జగన్ చేతులెత్తేశారు అంటూ సెటైర్లు వేశారు. అందుకే జగన్ ఏం చేయాలో తెలియక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ చార్జులను మారుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో పనికిరానివాళ్లు మరో నియోజకవర్గానికి ఎలా పనికొస్తారు? అని బోండా ఉమ ప్రశ్నించారు. అన్ని సర్వేలు కూడా వైసీపీ ఓడిపోతుందని అంటున్నాయని అన్నారు.

B.Tech Ravi : టీడీపీలోకి కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు : బీటెక్ రవి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేయటానికి ఇష్టంలేక పారిపోయారని బోండా ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంగళగిరిలో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే క్యూలో నిలబడ్డారని అన్నారు. రాజధాని అమరావతిని నాశనం చేసి తప్పుడు కేసులు పెట్టించి..టీడీపీ నేతల్ని వేధించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. జగన్  ఎన్నికలకు మూడు నెలల ముందే ఓటమి భయంతో చేతులెత్తేసారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆఖరికి పీకే టీమ్ కూడా వైసీపీకి పరాజయం తప్పదని తేల్చేసిందన్నారు.