Rinku Singh : సిక్స్ కొట్టినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైర‌ల్‌

Rinku Singh apologizes : భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న రింకూ సింగ్ ప్ర‌స్తుతం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

Rinku Singh : సిక్స్ కొట్టినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైర‌ల్‌

IND vs SA 2nd T20

భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం రింకూ సింగ్ పేరు మారుమోగిపోతుంది. ఐపీఎల్ 2023లో ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు బాదడంతో అత‌డు వెలుగులోకి వ‌చ్చాడు. భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న అత‌డు ప్ర‌స్తుతం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప‌నిలో ఉన్నాడు. గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియాను వేధిస్తున్న ఫినిష‌ర్ బాధ్య‌త‌ను అత‌డు చ‌క్క‌గా నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో రాణించిన రింకూ సింగ్ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ దుమ్ములేపుతున్నాడు.

మొద‌టి టీ20 మ్యాచ్ వర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన రెండో టీ20లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 68 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌డు బాదిన రెండు సిక్స‌ర్ల‌లో ఓ సిక్స్ మీడియా బాక్స్ అద్దాన్ని బ‌ద్ద‌లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై తాజాగా రింకూ స్పందించాడు.

Mohammed Shami : ష‌మీ ఫామ్‌హౌస్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో అభిమానులు.. ఎందుకంటే..?

సిక్స్ మాత్ర‌మే కొట్టాల‌నుకున్నా..

బీసీసీఐ విడుద‌ల చేసిన వీడియోలో త‌న ప్ర‌ద‌ర్శ‌న గురించి రింకూ మాట్లాడుతూ.. అద్దం ప‌గిలిన ఘ‌ట‌న‌పై కూడా స్పందించాడు. నిజానికి ఆ షాట్ సిక్స్‌గా కొట్టిన‌ప్పుడు అద్దం ప‌గిలింద‌నే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఇప్పుడే ఆ విష‌యం గురించి తెలిసిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అద్దం ప‌గ‌లకొట్టినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. తాను సిక్స‌ర్ మాత్ర‌మే కొట్టాల‌ని అనుకున్నాన‌ని, అద్దాన్ని మాత్రం బ‌ద్ద‌లు కొట్టాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని చెప్పాడు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నీ ఆట‌తోనే కాదు.. నీ మాటల‌తో మా మ‌న‌సులు గెలుచుకున్నావ్ అని అంటున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 19.3 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 180 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత వ‌ర్షం వ‌చ్చింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ద‌క్షిణాఫ్రికా ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌కు 152 ప‌రుగుల‌కు కుదించారు. ఈ ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా 13.5 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Wasim Jaffer : ఐపీఎల్‌లో ఆ రూల్‌ను తీసేయండి.. లేదంటే భార‌త క్రికెట్‌కు పెను ముప్పు త‌ప్ప‌దు..!