ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఐసీసీ షాక్‌.. ద‌క్షిణాఫ్రికా అదృష్టం మామూలుగా లేదుగా..!

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది.

ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఐసీసీ షాక్‌.. ద‌క్షిణాఫ్రికా అదృష్టం మామూలుగా లేదుగా..!

India penalised for slow over rate

Team India : సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల ప‌ట్టికలోని భార‌త్‌ ఖాతా నుంచి రెండు పాయింట్లను అంత‌ర్జాతీ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొల‌గించింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా స్లో ఓవ‌ర్ రేటు న‌మోదు చేసింది.

సెంచూరియన్ టెస్టులో భారత్ అవసరమైన ఓవర్ రేట్‌ను కొనసాగించడంలో విఫలం కావ‌డంతో ఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదండోయ్ టీమ్ఇండియా మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా కూడా విధించింది. ఐసీసీ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం టార్గెట్ లోపు భార‌త్ రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది.

Also Read ‘అందుకే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి’.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారో తెలుసా?

దీంతో ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలోని ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 5శాతం జరిమానా విధించబడుతుంది.

సెంచూరియ‌న్ టెస్టు ముందు భార‌త్ 66.67 విజ‌య శాతంతో డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానంలో ఉంది. అయితే.. మొద‌టి టెస్టు మ్యాచులో ఓడిపోవ‌డంతో భార‌త్ విజ‌య‌శాతం 44.44 శాతానికి ప‌డిపోయింది. దీంతో ఏకంగా ఆరో స్థానానికి టీమ్ఇండియా ప‌డిపోయింది. ఇక ఆడిన ఒక్క‌టెస్టులో గెలిచిన ద‌క్షిణాఫ్రికా వంద శాతం విజ‌య‌శాతంతో ప‌ట్టిక‌లో మొద‌టి స్థానానికి చేరింది. 50 శాతం విజ‌య‌శాతంతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఆ త‌రువాత ఆస్ట్రేలియా (50.00), బంగ్లాదేశ్ (50.00), పాకిస్తాన్ (45.83) లు ఉన్నాయి.

Also Read: 146 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి.. కోహ్లీకే ఈ రికార్డు సొంతం