Sachin Tendulkar: ‘అందుకే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి’.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారో తెలుసా?

ఎల్గర్, జాన్సన్, బెడింగ్‌ హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే పరిస్థితులకు...

Sachin Tendulkar: ‘అందుకే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి’.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారో తెలుసా?

Sachin Tendulkar

సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన టెస్టు మ్యాచులో భారత్ ఘోర ఓటమిని చవిచూడడంపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సూపర్‌స్పోర్ట్ పార్క్‌ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ, భారత బ్యాటర్లు షాట్లు ఆడిన తీరు బాగోలేదని అన్నారు. అందుకే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైందని అభిప్రాయపడ్డారు.

‘దక్షిణాఫ్రికా ఆటతీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు వెనకబడుతుందని భావించాను. అయితే, ఆ జట్లు పేసర్లు అంచనాలను మించి బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగానే ఉంది.

అయినప్పటికీ, బ్యాటర్లు షాట్లు ఆడిన తీరు బాగోలేదు. ఈ టెస్ట్ మ్యాచులో ఎల్గర్, జాన్సన్, బెడింగ్‌ హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా గొప్ప నైపుణ్యాలతో బాగా బ్యాటింగ్ చేశారు’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

కాగా, తొలి టెస్టు మ్యాచులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్ల వద్ద 245 పరుగులకే ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా 108.4 ఓవర్ల వద్ద 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 34.1 ఓవర్ల వద్ద 131 పరుగులకే ఔట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగులతో విజయం సాధించింది.

Virat Kohli: 146 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి.. కోహ్లీకే ఈ రికార్డు సొంతం