Azolla Cultivation : అజొల్లా పెంపకంతో రైతులకు లాభాలు.. మరెన్నో ఉపయోగాలు

Azolla Cultivation : వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ.. రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా.

Azolla Cultivation : అజొల్లా పెంపకంతో రైతులకు లాభాలు.. మరెన్నో ఉపయోగాలు

Azolla Cultivation

Azolla Cultivation :  పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏఏటికాయేడు పెరుగుతుండటం.. ఆదాయ మార్గాలు అదేస్థాయిలో తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ.. రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా.

మరీ ముఖ్యంగా వరిసాగులో కీలకపాత్ర పోషించడంతోపాటు పాడిరైతులు, ఇతర జీవాల పెంచే రైతులకు వాటికి అవసరమైన మేత, దాణ ఖర్చులను తగ్గిస్తూ.. మంచి లాభాలు కలిగిస్తోంది. అయితే దీని ప్రయోజనాలేంటీ.. ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వెంకటలక్ష్మి.

Read Also : Chilli Crop Cultivation : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

రైతులకు వరంగా మారిన అజొల్లా  : 
చిన్న, చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజోల్లా.. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ మొక్క..  ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది .  ఇది పెరగానికి నేల అవసరంలేకుండా నీటిపైనే పెరుగుతుంది. అన్ని మొక్కల్లా కాకుండా.. దానికి అవసరమైన నత్రజని ఎరువులను వాతావరణం నుండి నేరుగా పొందగలదు.

అంతేకాదు పంటల్లో అధిక దిగుబడిని పెంచడం, మేత, దాణా కొరతను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా.. ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అలాంటి ఈ అజోల్లాను రైతు స్థాయిలో ఏవిధంగా పెంచుకోవచ్చు.. దాని ఉపయోగాలేంటో సవిరంగా తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వెంకటలక్ష్మి.

అజొల్లా పెంపకం :
అజొల్లా మదర్ కల్చర్ 1-15 కి. వేయాలి

కిలో మదర్ కల్చర్ నుండి అజొల్లా దిగుబడి 6 -7 కి.

ఎకరాకు యూరియా 80 కిలో.

పశువుల పేడ :
సింగిల్ సూపర్ ఫాస్పేట్

చిన్న తోట్లు :
వారంలో అజొల్లా తయారు

తొట్టి నిర్మాణం : 
పొడవు 2.5 మీటర్లు.. వెడల్పు 1.5 మీటర్లు..  ఎత్తు 10 -15 సెం. మీ.

పాలీథిన్ షీట్ ఏర్పాటు సారవంతమైన పుట్టమన్ను

పశువుల పేడ 4-5 కి. నీటిని 10 సెంటీమీటర్లు నింపాలి.

Read Also : Papaya Cultivation Techniques : బొప్పాయిలో సూక్ష్మధాతు లోపం నివారణ.. సూచనలిస్తున్న శాస్త్రవేత్తలు