Shortest Test match ever : టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ ఏదో తెలుసా..?

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో బంతుల ప‌రంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డుల‌కు ఎక్కింది.

Shortest Test match ever : టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ ఏదో తెలుసా..?

Shortest Test match ever

Shortest Test match : భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు కేప్‌టౌన్ వేదిక‌గా త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ కేవ‌లం ఒక‌టిన్న‌ర రోజుల్లోనే(నాలుగు సెష‌న్లు) ముగిసింది. ఈ మ్యాచులో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే బంతుల ప‌రంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డుల‌కు ఎక్కింది. 642 బంతుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ క్ర‌మంలో దాదాపు 91 ఏళ్లుగా కొన‌సాగుతున్న రికార్డును ఈ మ్యాచ్ బ‌ద్ద‌లు కొట్టింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అతి త‌క్కువ బంతుల్లో పూరైన మ్యాచ్‌గా ఉండేది. 1932లో మెల్‌బోర్న్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రిగింది. కేవ‌లం 656 బంతుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తాజాగా కేప్‌టౌన్ టెస్టు ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఇక ఈ జాబితాలో 1935లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. 672 బంతుల్లో ఈ మ్యాచ్ పూర్తైంది. ఆ త‌రువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 1888లో జ‌రిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ 788 బంతుల్లో ముగిసింది.

అతి త‌క్కువ బంతుల్లో ఫ‌లితం తేలిన మ్యాచులు ఇవే..

భార‌త్ vs సౌతాఫ్రికా – 642 బంతులు – కేప్‌టౌన్, 2024
ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా – 656 బంతులు – మెల్‌బోర్న్, 1932
వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ – 672 బంతులు – బ్రిడ్జ్‌టౌన్, 1935
ఇంగ్లాండ్‌ vs ఆస్ట్రేలియా – 788 బంతులు – మాంచెస్టర్, 1888
ఇంగ్లాండ్‌ vs ఆస్ట్రేలియా – 792 బంతులు – లార్డ్స్, 1888

WTC Points table : ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరిన భార‌త్‌..

ఇక కేప్‌టౌన్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ 153 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్‌కు 98 ప‌రుగుల కీల‌క మైన మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఆ త‌రువాత మార్‌క్ర‌మ్ (106) శ‌త‌కంతో చెల‌రేడంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 176 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Rohit Sharma : ధోని అరుదైన కెప్టెన్సీ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ, స‌చిన్ వ‌ల్ల కాలేదు..

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసివేయ‌గా భార‌త్ ముందు 79 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 12 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ 28, శుభ్‌మ‌న్ గిల్ 10, రోహిత్ శ‌ర్మ 17 నాటౌట్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ 4 నాటౌట్‌లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్, క‌గిసో ర‌బాడ, మార్కో జాన్సెన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.