2024 Mahindra XUV700 : కొత్త కారు కొంటున్నారా? అత్యాధునిక ఫీచర్లతో 2024 మహీంద్రా XUV700 మోడల్ కారు.. ధర ఎంతో తెలుసా?

2024 Mahindra XUV700 Launch : భారత మార్కెట్లోకి 2024 మహీంద్రా XUV700 కారు మోడల్ వచ్చేసింది. టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి పోటీగా అందుబాటులో ఉంది. ఈ కారు ధర ఎంతో తెలుసా?

2024 Mahindra XUV700 : కొత్త కారు కొంటున్నారా? అత్యాధునిక ఫీచర్లతో 2024 మహీంద్రా XUV700 మోడల్ కారు.. ధర ఎంతో తెలుసా?

2024 Mahindra XUV700 launched in India, price starts at Rs 13.99 lakh

2024 Mahindra XUV700 Launch : భారత అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారు మహీంద్రా & మహీంద్రా నుంచి సరికొత్త 2024 మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కారు వచ్చేసింది. భారత మార్కెట్లో టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా వచ్చింది. ఈ మహీంద్రా XUV700 మోడల్ కారు ప్రారంభ ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ అయినట్టు కంపెనీ ప్రకటించింది.

Read Also : Infinix Smart 8 Sale : ఐఫోన్ 16 డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్.. సేల్ మొదలైందోచ్.. ధర ఎంతంటే?

2024 ఎక్స్‌యూవీ700 ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ అప్‌డేట్‌లను కలిగి ఉంది. సరికొత్త నాపోలి బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగి ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి. 2023లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ 74,434 యూనిట్లను విక్రయించింది. ఆగస్ట్ 2021లో లాంచ్ అయినప్పటి నుంచి ఎక్స్‌యూవీ700 మోడల్ 140,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది.

2024 Mahindra XUV700 launched in India, price starts at Rs 13.99 lakh

Mahindra XUV700 India

ఈరోజు నుంచి బుకింగ్స్ ప్రారంభం.. :
2024 ఎక్స్‌యూవీ700 జనవరి 15 నుంచి బుకింగ్‌లకు అందుబాటులో ఉంటుంది. డెమో వాహనాలు జనవరి 25 నుంచి డీలర్‌షిప్‌లకు చేరుకుంటాయి. ఎస్‌యూవీ వేగవంతమైన డెలివరీలకు మహీంద్రా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొత్త నాపోలి బ్లాక్ కలర్ ఆప్షన్ పొందుతుంది. బ్లాక్ రూఫ్ రెయిల్స్, క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన బ్లాక్ గ్రిల్, బ్లాక్ అల్లాయ్‌లను కలిగి ఉంది. నాపోలి బ్లాక్ రూఫ్‌తో కూడిన ఆప్షనల్ డ్యూయల్-టోన్ కలర్ అందుబాటులో ఉంది. లోపల ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్ వేరియంట్‌లు డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్, కన్సోల్ బెజెల్ వంటి అప్‌గ్రేడ్ కలిగి ఉన్నాయి.

2024 Mahindra XUV700 launched in India, price starts at Rs 13.99 lakh

2024 Mahindra XUV700 price  

మహీంద్రా ఎక్స్‌యూవీ700 స్పెషిఫికేషన్లు :
2024 ఎక్స్‌యూవీ 700 ఇప్పుడు ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్ వేరియంట్‌లలో కెప్టెన్ సీట్లను అందిస్తుంది. ఏఎక్స్7ఎల్‌లో ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. ప్రత్యేకంగా ఏఎక్స్7ఎల్‌లో మహీంద్రా మెమొరీ ఫంక్షన్‌తో బయటి వెనుక వ్యూ మిర్రర్ (ORVM) ఏకీకృతం చేసింది. 2024 మహీంద్రా ఎక్స్‌యూవీ700 అడ్రినోక్స్ సూట్ ఇప్పుడు 13 అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

దాంతో మొత్తం 83 కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫర్మ్‌వేర్ ఓవర్-ది-ఎయిర్ (FOTA) సామర్థ్యాలు, రాబోయే సర్వీసు రిక్వైర్‌మెంట్స్‌పై సకాలంలో అప్‌డేట్‌లను అందించే ప్రోగ్నోసిస్ ఫీచర్ ‘ఆస్క్ మహీంద్రా’ ఉన్నాయి. అదనంగా, ఎమ్ లెన్స్ ఫీచర్ డ్రైవర్‌లను ఎస్‌యూవీలో బటన్‌లను, టెల్-టేల్ లైట్లను స్కాన్ చేసేందుకు అనుమతిస్తుంది.

2024 Mahindra XUV700 launched in India, price starts at Rs 13.99 lakh

2024 Mahindra XUV700 launched in India 

2024 మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫీచర్లు హెచ్చరికలు, వాహన కండిషన్, లోకేషన్-ఆధారిత సర్వీసులు, భద్రత, రిమోట్ ఫంక్షన్‌లు, థర్డ్-పార్టీ యాప్‌లు, కొత్తదనంతో ఇంటిగ్రేట్ చేసిన ఫీచర్‌లు వంటి కీలక విభాగాలుగా వర్గీకరించారు. ఈ ఫంక్షనాలిటీలకు యాక్సెస్‌కి యాక్టివేషన్ కోసం (Adrenox) సబ్‌స్క్రిప్షన్ అవసరం పడుతుంది. 2024 మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలివే :

  •  ఎంఎక్స్ – రూ 13.99 లక్షలు
  • ఏఎక్స్3 – రూ. 16.39 లక్షలు
  • ఏఎక్స్5 – రూ. 17.69 లక్షలు
  • ఏఎక్స్7 – రూ. 21.29 లక్షలు
  • ఏఎక్స్7ఎల్ – రూ. 23.99 లక్షలు

2024 మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ 2.0-లీటర్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. రెండోది రెండు ట్యూన్‌లలో అందిస్తోంది. పెట్రోల్ ఇంజన్ 200బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, డీజిల్ ఇంజన్ వేరియంట్‌ను బట్టి 155బిహెచ్‌పి లేదా 185బిహెచ్‌పిని అభివృద్ధి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఆప్షనల్ ఏడబ్ల్యూడీ కూడా అందుబాటులో ఉంది.

2024 Mahindra XUV700 launched in India, price starts at Rs 13.99 lakh

2024 Mahindra XUV700

వైట్ గ్లోవ్ చౌఫర్ ట్రైనింగ్ ప్రోగ్రాం :
2024 ఎక్స్‌యూవీ700 లాంచ్‌లో భాగంగా మహీంద్రా ప్రతి రెండు నెలలకు ఒకసారి మెట్రో పట్టణాలలో ‘వైట్ గ్లోవ్ చౌఫర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ని నిర్వహిస్తుంది. సంస్థ నుంచి నిపుణులతో డ్రైవర్‌లకు శిక్షణను అందిస్తుంది. శిక్షణలో వాహన కార్యాచరణలు, అడాస్ సిస్టమ్‌లు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, లోపాలు, సంకేతాలను అర్థం చేసుకోవడం వంటివి ఉంటాయి. పైలట్ దశలో ముందుగా ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇతర మెట్రో నగరాలకు విస్తరించనున్నారు.

Read Also : Redmi 12 Sale : రూ. 10వేల లోపు ధరలో రెడ్‌మి 12 ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనాలా? వద్దా?