Mohammed Shami : గుజ‌రాత్ టైటాన్స్‌ను వీడ‌నున్న శుభ్‌మ‌న్ గిల్..? ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌, గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Mohammed Shami : గుజ‌రాత్ టైటాన్స్‌ను వీడ‌నున్న శుభ్‌మ‌న్ గిల్..? ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Mohammed Shami honest take on Hardik Pandya leaving Gujarat Titans

Mohammed Shami – Hardik Pandya : టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌, గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవ‌ల గుజరాత్‌ను వీడి ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిసిన హార్దిక్ పాండ్య గురించి మాట్లాడాడు. అత‌డు వెళ్లినా జ‌ట్టుకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌ని, జ‌ట్టు స‌మ‌తూకంగా ఉందా..? లేదా..? అన్న విష‌యం మాత్ర‌మే ముఖ్య‌మన్నాడు. గుజ‌రాత్‌తో హార్దిక్ జీవిత‌కాలం ఒప్పందం చేసుకోలేద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని, ఉండాలా వెళ్లాలా అనేది అత‌డి నిర్ణ‌య‌మ‌ని చెప్పుకొచ్చాడు.

రెండేళ్ల క్రితం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చింది. త‌న మొద‌టి సీజ‌న్‌లోనే విజేత‌గా నిలిచింది. ఇక రెండో సీజ‌న్‌లోనూ ఫైన‌ల్‌కు చేరుకుంది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఈ రెండు సీజ‌న్ల‌లోనూ జ‌ట్టును హార్దిక్ పాండ్య ముందుండి న‌డిపించాడు. అయితే.. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు అత‌డు ముంబై గూటికి చేరుకున్నాడు. ట్రేడింగ్ ద్వారా ముంబై అత‌డిని సొంతం చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చే జ‌రిగింది. హార్దిక్ కోసం ముంబై ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

గిల్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు..

హార్దిక్ పాండ్య గుజ‌రాత్‌ను వ‌దిలి వెళ్ల‌డంతో శుభ్‌మ‌న్ గిల్ త‌మ జ‌ట్టును న‌డిపిస్తాడ‌ని గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం ఇప్ప‌టికే వెల్ల‌డించింది. కాగా.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ష‌మీ జ‌రిగిన ప‌రిణాల‌పై కీల‌క వ్యాఖ్యాలు చేశాడు. జ‌ట్టును ఎవ‌రు విడిచిపెట్టి వెళ్లినా న‌ష్టం లేద‌న్నాడు. జ‌ట్టు స‌మ‌తూకంగా ఉందా లేదా అన్న‌దే చూడాల‌ని సూచించాడు. గ‌తంలో హార్దిక్ మాతో ఉన్నాడ‌ని, జ‌ట్టును అద్భుతంగా న‌డిపించాడ‌న్నాడు. రెండు సీజ‌న్ల‌లో ఫైన‌ల్‌కు చేరుకున్నామ‌ని చెప్పాడు. ఓ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచామ‌న్నాడు.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ చేసేది అన్యాయం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వ్యాఖ్య‌లు వైర‌ల్

గుజ‌రాత్‌తో హార్దిక్ జీవిత‌కాల ఒప్పందం చేసుకోలేద‌న్నాడు. ఉండాలా.. వెళ్లాలా అనేది అత‌డి నిర్ణ‌యం అని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం గిల్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకున్నాడ‌ని, అత‌డికి కెప్టెన్సీ అనుభ‌వం వ‌స్తుంద‌న్నాడు. ఇక ఏదో ఒక రోజు అత‌డు కూడా గుజ‌రాత్‌ను వ‌దిలి వెళ్లొచ్చున‌ని అన్నాడు. కెప్టెన్ త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో గిల్ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని, త‌న బాధ్య‌త‌ల‌ను అత‌డు చ‌క్క‌గా నెర‌వేరుస్తాడ‌నే న‌మ‌క్మం త‌న‌కు ఉంద‌ని చెప్పాడు. జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్ల నుంచి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకుంటే కెప్టెన్ ప‌ని చాలా సుల‌భం అవుతుంద‌ని చెప్పాడు.

ఐపీఎల్ 2023లో గుజరాత్ త‌రుపున 17 మ్యాచ్‌లు ఆడిన షమీ 28 వికెట్లు తీసి ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అదే స‌మ‌యంలో గిల్ సైతం 890 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

గుజరాత్ టైటాన్ స్క్వాడ్ : డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, సా నూర్ అహ్మద్, నూర్ అహ్మద్ , రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్.

Praggnanandhaa : ప్ర‌జ్ఞానంద సంచ‌ల‌నం.. విశ్వనాథ‌న్ ఆనంద్‌కు షాక్‌.. భార‌త టాప్ చెస్ ప్లేయ‌ర్‌గా..