WhatsApp New Updates : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఛానెల్స్, వాయిస్ నోట్స్, పోల్స్ కోసం సరికొత్త ఫీచర్లు..!

WhatsApp New Updates : వాట్సాప్‌లో అతి త్వరలో పెద్ద మొత్తంలో కొత్త ఫీచర్లు రానున్నాయి. వాయిస్ నోట్స్, మల్టిపుల్ అడ్మిన్‌లు, స్టేటస్‌కు షేర్ చేయడం, పోల్స్‌తో సహా ఛానెల్‌ల కోసం కొత్త ఫీచర్ల శ్రేణిని విడుదల చేస్తోంది.

WhatsApp New Updates : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఛానెల్స్, వాయిస్ నోట్స్, పోల్స్ కోసం సరికొత్త ఫీచర్లు..!

WhatsApp rolling out new updates for Channels, voice notes, polls and more

WhatsApp New Updates : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వన్-వే బ్రాడ్‌క్యాస్ట్ టూల్ ఛానెల్‌ల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వాయిస్ నోట్స్, మల్టిపుల్ అడ్మిన్‌లు, స్టేటస్‌‌‌ను పోల్‌లకు షేర్ చేయడం వంటి అప్‌డేట్‌లను ఛానెల్‌లు స్వీకరిస్తాయని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త అప్‌డేట్‌లు వాట్సాప్ ఛానెల్‌లతో ఎంగేజ్ కావడానికి యూజర్లకు మరిన్ని మార్గాలను అందించనున్నాయని అన్నారు.

Read Also : Moto G Play 2024 Phone : మోటో జీ ప్లే 2024 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

వాట్సాప్ ఛానెల్‌ల కోసం వాయిస్ నోట్స్, మల్టిపుల్ అడ్మిన్‌లు, స్టేటస్‌కు షేర్ చేయడం, పోల్‌లతో సహా కొత్త ఫీచర్ల శ్రేణిని పరిచయం చేస్తున్నామని మెటా సీఈఓ తెలిపారు. ‘ఆల్ టైమ్‌లో అత్యుత్తమ గేమ్’పై ఓటు వేయమని కోరుతూ పోల్ క్రియేట్ చేశారు. వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లో కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా అన్ని ఫీచర్లను అందుబాటులో తీసుకురానుంది. రాబోయే కొత్త ఫీచర్లలో ఈ కింది విధంగా ఉండనున్నాయి.

వాయిస్ అప్‌డేట్స్ :
చాలా మంది యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్‌లలో ఇదొకటి. వాయిస్ అప్‌డేట్‌లు ఛానెల్ అడ్మిన్‌లు తమ ఫాలోయర్‌లతో మరింత కనెక్ట్ అయ్యేందుకు సాయపడతాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే ప్రతిరోజూ 7 బిలియన్ వాయిస్ నోట్‌లను ఎక్స్ఛేంజ్ చేస్తుందని, ఈ ఫీచర్ వాయిస్ నోట్‌లను ఛానెల్‌లకు ప్రముఖ కమ్యూనికేషన్ ఫార్మాట్‌గా మారుస్తుందని వాట్సాప్ తెలిపింది.

పోల్స్ :
వాట్సాప్‌లో ఎంగేజ్‌మెంట్‌ను మరింత పెంచుకోవడానికి ఛానెల్‌లు ఇప్పుడు పోల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఛానెల్ అడ్మిన్లు వారి ఆడియెన్స్ అభిప్రాయాలు, ప్రాధాన్యతలను నేరుగా ట్యాప్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌ల గురించి మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఫీచర్ ద్వారా పోల్‌ను క్రియేట్ చేశారు. ఈ పోల్స్‌తో, వాట్సాప్ యూజర్లను సంక్షిప్త ప్రశ్నలను రూపొందించడానికి, బహుళ సమాధాన ఆప్షన్లను అందించడానికి అనుమతిస్తుంది, ఇన్‌యాక్టివ్ వీక్షకులను యాక్టివ్ పార్టిసిపెంట్‌లుగా మారుస్తుంది.

WhatsApp rolling out new updates for Channels, voice notes, polls and more

WhatsApp new updates for Channels 

షేర్ టు స్టేటస్ :
వాట్సాప్ ఛానెల్‌లు, వ్యక్తిగత కనెక్షన్‌ల మధ్య ఉన్న అంతరాన్ని షేర్ టు స్టేటస్‌తో తగ్గిస్తుంది. యూజర్లు తమ అభిమాన ఛానెల్‌ల నుంచి వారి వాట్సాప్ స్టేటస్‌కు ఆకర్షణీయమైన అప్‌డేట్‌లను నేరుగా షేర్ చేసుకోవచ్చు. వారి సొంత నెట్‌వర్క్‌కు క్యాంపెయిన్ చేయవచ్చు. వినియోగదారులకు ఇష్టమైన అంశాలపై సమాచారం అందించడంలో సాయపడుతుంది.

మల్టిపుల్ అడ్మిన్స్ :
వాట్సాప్ ఛానెల్‌లు మల్టీపుల్ అడ్మిన్స్ ఫీచర్‌ ద్వారా గ్రూప్ మేనేజ్‌మెంట్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. గరిష్టంగా 16 మంది అడ్మిన్‌లను కలిగి ఉండే సామర్థ్యంతో, ప్లాట్‌ఫారమ్ ఛానెల్‌లలో కమ్యూనికేషన్ ఫ్లోను క్రమబద్ధీకరించడానికి యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ ఛానెల్స్ 500 మిలియన్ల నెలవారీ యాక్టివ్ వినియోగదారులకు చేరుకున్నట్లు ప్రకటించింది.

ఇప్పుడు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖుల ప్రొఫైల్‌లతో పాటు ముంబై ఇండియన్స్, మెర్సిడెస్ ఎఫ్1, నెట్‌ఫ్లిక్స్ వంటి బ్రాండ్‌లను కలిగి ఉంది. వాట్సాప్ ఛానెల్‌లు వినియోగదారులు వారి వ్యక్తిగత చాట్‌లతో మిక్స్ చేయకుండా, వ్యక్తులు, సంస్థల నుంచి ప్రైవేట్‌గా ముఖ్యమైన అప్‌డేట్‌లను పొందవచ్చు. చూసేందుకు… ఇది ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌క్యాస్ట్ ఫీచర్‌ను పోలి ఉంటుంది.

Read Also : Noise ColorFit Chrome : కొత్త వాచ్ కావాలా?.. నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?