Tripti Dimri : విజయ్ దేవరకొండ సరసన యానిమల్ భామ త్రిప్తి దిమ్రి.. శ్రీలీల తప్పుకుందా?

విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అయింది.

Tripti Dimri : విజయ్ దేవరకొండ సరసన యానిమల్ భామ త్రిప్తి దిమ్రి.. శ్రీలీల తప్పుకుందా?

Sreeleela Replaced with Animal Movie Fame Tripti Dimri in Vijay Devarakonda movie

Tripti Dimri : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల సమంతతో కలిసి ఖుషి సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ పరుశురాంతో ‘ఫ్యామిలీ స్టార్'(Family Star) సినిమా. ఇందులో మృణాల్ నటిస్తుండగా ఇప్పటికే ఆల్మోస్ట్ 90 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. సమ్మర్ కి ఫ్యామిలీ స్టార్ వస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ చేతిలో జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఇంకో సినిమా ఉంది. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ఇందులో శ్రీలీల(Sreeleela) నటిస్తుండగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిపి పని మొదలుపెట్టింది. షూటింగ్ కూడా కొంత శాతం జరిగిందని సమాచారం. అయితే ఈ సినిమాలో శ్రీలీల తప్పుకుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతుండాలి. కానీ విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అయింది. ప్రస్తుతం శ్రీలీల వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం, MBBS చివరి దశలో ఉండటంతో దానికి సంబంధించిన వర్క్స్.. ఇలా శ్రీలీల ఇప్పుడు విజయ్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుండటంతో సినిమాలో శ్రీలీల బదులు వేరే హీరోయిన్ ని తీసుకున్నారని తెలుస్తుంది. ఆ హీరోయిన్ యానిమల్ సినిమా భామ త్రిప్తి దిమ్రి అని సమాచారం.

Also Read : Rashmika Mandanna : రణబీర్‌ని చెంప మీద కొట్టి ఏడ్చేశాను.. ఇలా లైఫ్‌లో మళ్ళీ రాదేమో..

యానిమల్(Animal) సినిమాలో రష్మిక హీరోయిన్ అయినా సెకండ్ హాఫ్ లో కాసేపు కనిపించి అందరి మనుసులని దోచేసింది త్రిప్తి దిమ్రి. ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి నేషనల్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగారు. యానిమల్ సినిమా త్రిప్తి దిమ్రి లైఫ్ ని మార్చేసింది. ఇప్పుడు త్రిప్తి దిమ్రి సెన్సేషన్. యాడ్స్, సినిమాలంటూ పలు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రిప్తి దిమ్రి ఎలాగో యానిమల్ సినిమాతో సౌత్ లో కూడా ఫేమస్ అయింది కాబట్టి విజయ్ దేవరకొండ సరసన ఈమెను తీసుకుంటున్నట్టు సమాచారం. మరి త్రిప్తి దిమ్రిని కలిసి కథ చెప్పారా? ఆమె ఓకే చెప్పిందా అనేది తెలియదు. దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ ఇదే నిజమైతే త్రిప్తి దిమ్రి టాలీవుడ్ లో కూడా రాణిస్తుంది.