Rohan Bopanna : రికార్డుల‌ను తిర‌గ‌రాసిన రోహ‌న్ బోప‌న్న.. మొద‌టిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌కు

భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బోప‌న్న మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Rohan Bopanna : రికార్డుల‌ను తిర‌గ‌రాసిన రోహ‌న్ బోప‌న్న.. మొద‌టిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌కు

Rohan Bopanna Re Writes Record Books Enters Australian Open Men's Doubles Final

Rohan Bopanna- Australia Open 2024 : భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బోప‌న్న మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2024లో డ‌బుల్స్ విభాగంలో ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అతి పెద్ద వ‌య‌సులో గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరిన ఆట‌గాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టాడు.

గురువారం జ‌రిగిన పురుషుల డ‌బుల్స్ సెమీఫైన‌ల్ మ్యాచులో థామ‌స్ మాచాక్‌-జాంగ్ జిషెన్‌పై రోహన్ బోప‌న్న‌-మాథ్యూ ఎబ్డెన్ జోడీ విజ‌యం సాధించి తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 6-3 3-6 7-6 (10-7) బోప‌న్న- మాథ్యూ జోడీ గెలుపొందింది.

చారిత్రాత్మ‌క మైలురాయిని చేరుకున్న అశ్విన్‌-జ‌డేజా జోడీ.. కుంబ్లే-భ‌జ్జీల ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు..

దాదాపు రెండు గంట‌ల రెండు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొద‌టి సెట్ నుంచి బోప‌న్న జోడి దూకుడుగా ఆడింది. మొద‌టి సెట్‌ను అల‌వోక‌గా సొంతం చేసుకుంది. అయితే.. రెండో సెట్‌లో ప్ర‌త్య‌ర్థి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. ఈ క్ర‌మంలో అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేయ‌డంతో రెండో సెట్‌ను కోల్పోయింది. ఆ త‌రువాత బోప‌న్న జోడీ పుంజుకోగా అటు మాచాక్ జోడి సైతం గ‌ట్టిగా పోరాడంతో 6-6తో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.


సూప‌ర్ టై బ్రేక‌ర్స్‌లో రోహ‌న్ జోడి 10-7తో గెలుపొంది సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఒకే ఒక్క భార‌తీయుడు