Simran Natekar : వార్నీ ఆ సిగరెట్ యాడ్ గర్ల్ ? ఎంత అందంగా మారిపోయింది

6 ఏళ్ల వయసులో నో స్మోకింగ్ యాడ్‌లో నటించిన చిన్నారిని ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేసేస్తూ ఫుల్ పేరు తెచ్చుకుంటున్న ఆ నటి ఎవరంటే?

Simran Natekar : వార్నీ ఆ సిగరెట్ యాడ్ గర్ల్ ? ఎంత అందంగా మారిపోయింది

Simran Natekar

Simran Natekar : థియేటర్‌లో సినిమాకి వెళ్లినప్పుడల్లా నో స్మోకింగ్ యాడ్ ప్రసారం చేస్తారు. ఆ యాడ్‌లో తండ్రి, కూతురు వెర్షన్ ఉంటుంది. అందులో కనిపించే చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నటి ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.

Teja Sajja : రవితేజ గారి వల్ల.. మాకు హీరోయిన్స్‌తో ఇబ్బంది.. తేజ సజ్జ వైరల్ కామెంట్స్..

ఇండియాలో ఏ థియేటర్‌కి వెళ్లినా ముందుగా కొన్ని ప్రకటనలు వస్తాయి. అందులో ఖచ్చితంగా నో స్మోకింగ్ యాడ్ ఉంటుంది. దీనిలో తండ్రి, కూతురు వెర్షన్ చూసే ఉంటారు. స్మోక్ చేస్తున్న తండ్రి పక్కన కూతురు కూర్చుని ఉంటుంది. తండ్రి సిగరెట్ తాగడం వల్ల కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో.. వారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఆ యాడ్ సారాంశం. అయితే ఆ యాడ్‌లో కనిపించే బాల నటి సిమ్రాన్ నటేకర్. అప్పుడు ఆమెకు 6 ఏళ్లు. ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందంటే? చూస్తే ఆశ్చర్యపోతారు. ఎంతో అందంగా ఉన్న సిమ్రాన్ నటేకర్ అటు టీవీ, ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Padma Soorya : సీరియల్ నటిని పెళ్లాడిన విలన్.. ఆ నటి ఎవరంటే?

6 సంవత్సరాల వయసులో నో స్మోకింగ్ యాడ్‌లో నటించిన సిమ్రాన్ ఏకంగా 150 వరకు యాడ్స్‌లో నటించారు. ‘బంధన్ సాత్ జన్మోంకా’ ఆమె నటించిన మొదటి సీరియల్ కాగా ‘దావత్-ఇ-ఇష్క్’ ఆమె నటించిన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం. ఆ తర్వాత హతీమ్, క్రిష్ 3 తో పాటు డిష్కియావూన్‌లో గెస్ట్ రోల్‌లో అలరించారు. 2015 లో ప్రసారమైన ‘బాలికా వధు’లో పూజా పాత్రలో నటించి అలరించారు సిమ్రాన్ నటేకర్. మై ఫస్ట్ యాడ్ ఆన్ నో స్మోకింగ్ అంటూ సిమ్రాన్ గతంలో తన యాడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ చిన్నారి ఇప్పుడు ఇంత అందంగా మారిపోయిందా? అని నెటిజన్లు ఆశ్యర్యపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)