AUS vs WI : చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్‌.. ఆ నిర్ణ‌యం వ‌ల్ల‌ చేజేతులా ఓడిన ఆస్ట్రేలియా..!

వెస్టిండీస్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది.

AUS vs WI : చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్‌.. ఆ నిర్ణ‌యం వ‌ల్ల‌ చేజేతులా ఓడిన ఆస్ట్రేలియా..!

Australia vs West Indies

Australia vs West Indies : వెస్టిండీస్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. దాదాపు 30 సంవ‌త్స‌రాల త‌రువాత ఆస్ట్రేలియా గ‌డ్డ పై టెస్టు మ్యాచులో విజ‌యం సాధించింది. గ‌బ్బా వేదిక‌గా ఉత్కంఠభ‌రితంగా సాగిన‌ పింక్ బాల్ టెస్టులో ఎనిమిది ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఫ‌లితంగా రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్‌స్మిత్ 91 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచినా త‌న జ‌ట్టును గెలిపించుకోలేక‌పోయాడు.

ఆ నిర్ణ‌య‌మే ఆస్ట్రేలియా కొంప ముంచిందా..?

ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 311 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఆసీస్ 289/9 స్కోరు వ‌ద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ నిర్ణ‌య‌మే ఆసీస్ కు ఎదురుదెబ్బ త‌గిలేలా చేసింది. అప్ప‌టికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ క‌మిన్స్ (64) విండీస్ బౌల‌ర్లను అల‌వోక‌గా ఆడుతున్నాడు. అయితే.. ఆలౌట్ అయ్యేంత వ‌ర‌కు ఆస్ట్రేలియా ఆడ‌కుండా వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో త్వ‌ర‌గా ఆలౌట్ చేయాల‌నే ల‌క్ష్యంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఒక‌వేళ అలా చేసి ఉండ‌కుండా మ‌రికొన్ని ప‌రుగులు ఆస్ట్రేలియా చేసి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.

Sania Mirza : విడాకుల త‌రువాత సానియా మీర్జా మొద‌టి పోస్ట్‌.. ఏమ‌న్న‌దంటే..?

కాగా.. ఆసీస్ అనుకున్న‌ట్లుగానే వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 193 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు ల‌భించిన ఆధిక్యం 22 ప‌రుగులు క‌లుపుకుంటే ఆస్ట్రేలియా ముందు 216 ప‌రుగుల లక్ష్యం నిలిచింది. ఉస్మాన్ ఖవాజా (10), మార్న‌స్ ల‌బుషేన్ (5)లు తొంద‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేర‌డంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 42 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే.. కామెరూన్ గ్రీన్ (42) అండ‌గా స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ నిల‌బెట్టాడు. వీరిద్ద‌రు విండీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్‌కు 71 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇదే స‌మ‌యంలో వెస్టిండీస్ యువ పేస‌ర్ షామార్ జోసెఫ్ విజృంభించాడు. ఏడు వికెట్ల‌తో చెల‌రేగాడు. దీంతో ట్రావిస్ హెడ్ డ‌కౌట్ కాగా మిచెల్ మార్ష్ (10), అలెక్స్ కేరీ(2) లు విఫ‌లం అయ్యారు. ఓ వైపు స్టీవ్ స్మిత్ ఒంట‌రి పోరాటం చేసినప్ప‌టికీ మ‌రోవైపు అత‌డికి స‌హ‌క‌రించేవారే క‌ర‌వ‌య్యారు. చివ‌రికి ఎనిమిది ప‌రుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది.

BBL final : సూప‌ర్ క్యాచ్‌.. ఏమి టైమింగ్ అయ్యా మీది..

రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. ప్లేయర్ ఆప్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను వెస్టిండీస్ యువ ఆట‌గాడు షామార్‌ జోసెఫ్ ను సొంతం చేసుకున్నాడు.