Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తే ఔరా అనిపించ‌క‌మానదు.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

Batter survives after the ball passes between the stumps

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తే ఔరా అనిపించ‌క‌మానదు. వికెట్ల‌కు బంతి తాకినా బెయిల్స్ కింద‌ప‌డ‌క‌పోవ‌డాన్ని గ‌తంలో కొన్నిసార్లు చూశాం. అలాంటి స‌మ‌యంలో బ్యాట‌ర్ అదృష్టంతో మురిసిపోగా ఫీల్డింగ్ జ‌ట్టు తీవ్ర అసంతృప్తికి లోనైన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ స్థానిక టోర్నీలో జ‌రిగిన ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బంతి వికెట్ల మ‌ధ్య నుంచి వెళ్లినప్ప‌టికీ వికెట్ క‌నీసం స్థాన‌భ్రంశం చెంద‌లేదు స‌రిక‌దా బెయిల్స్ కూడా ప‌డ‌లేదు.

మహారాష్ట్రలోని థానేలో స్థానిక టోర్నమెంట్ అయిన నజీబ్ ముల్లా ట్రోఫీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ఫాస్ట్ బౌల‌ర్ బంతిని వేయ‌గా బ్యాట‌ర్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అత‌డి బ్యాట్‌కు బంతి త‌గ‌లేదు. మిడిల్, లెగ్ స్టంప్ ల మ‌ధ్య నుంచి బాల్ వెళ్లి కీప‌ర్ చేతిలో ప‌డింది. బంతి వేగానికి వికెట్లు ఎగ‌ర‌లేదు స‌రికదా క‌నీసం బెయిల్ కూడా ప‌డ‌లేదు.

రికార్డు సెంచరీతో రీఎంట్రీని ఘనంగా చాటిన పృథ్వీ షా

దీంతో స‌ద‌రు బ్యాట‌ర్ బ‌తికిపోయాడు. దీన్ని చూసిన బౌల‌ర్‌, ఫీల్డ‌ర్లు నిరాశ చెందారు. వికెట్ల మ‌ధ్య కాస్త ఎక్కువ దూరం ఉండ‌డంతోనే ఇలా జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లోనూ..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లోనూ ఇలాంటి ఓ ఘ‌ట‌న‌నే జ‌రిగింది. 1997-98లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఇది చోటు చేసుకుంది. పాకిస్తాన్ బౌల‌ర్ ముస్తాక్ అహ్మ‌ద్ వేసిన బంతి వికెట్ల మ‌ధ్య గుండా వెళ్లిపోయింది. బెయిల్స్ మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇలాంటి ఘ‌ట‌న గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఆ స‌మ‌యంలో కామెంట్రీ చేసిన వ్యాఖ్యాత‌లు తెలిపారు.

Viral Video : ఇన్నాళ్లు ఎక్కడున్నావ‌య్యా.. ఇన్ని వేరియేషన్స్‌.. ఇలా బౌలింగ్‌ చేస్తే ప్ర‌పంచ‌క‌ప్‌లు అన్నీ మ‌న‌వే?