ICC Player of the Month : జ‌న‌వ‌రి నెల‌కు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది ఎవ‌రో తెలుసా?

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫ్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

ICC Player of the Month : జ‌న‌వ‌రి నెల‌కు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది ఎవ‌రో తెలుసా?

Joseph and Hunter win ICC Player of the Month awards for January

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫ్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి నెల‌కు గాను పురుషుల క్రికెట్‌లో ఒక‌రికి, మ‌హిళ‌ల క్రికెట్‌లో ఒక‌రిని ఎంపిక చేసింది. పురుషుల క్రికెట్‌లో వెస్టిండీస్ న‌యా బౌలింగ్ సంచ‌ల‌నం షెమ‌ర్ జోసెఫ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. అత‌డి కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఐర్లాండ్ ప్లేయ‌ర్ అమీ హంట‌ర్‌కు ద‌క్కించుకుంది.

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచుతో షెమ‌ర్ జోసెఫ్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొలి టెస్టులో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న చిర‌కాలం గుర్తుండి పోతుంది. రెండో ఇన్నింగ్స్లో సంచ‌ల‌న బౌలింగ్‌లో జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యం గాని విజ‌యాన్ని అందించాడు. 216 ప‌రుగుల విజ‌యం ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాను 207కే ప‌రిమితం చేశాడు.

Virat Kohli : కోహ్లీ భార్యకు ఏమైంది? అనుష్క‌శ‌ర్మ ప్రెగ్నెన్సీలో స‌మ‌స్య‌లు? ఏదీ నిజం?

68 ప‌రుగులు ఇచ్చి ఏడు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్ ప‌త‌నంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను వెస్టిండీస్ 1-1తో డ్రా ముగించింది. జోసెఫ్ అరంగ్రేటంలోనే ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న‌న‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి జ‌న‌వ‌రి నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు వ‌రించింది. కాగా.. 2021 నుంచి ఐసీసీ పురుషుల ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ఇస్తుండ‌గా ఈ అవార్డు గెలుచుకున్న మొద‌టి వెస్టిండీస్ ఆట‌గాడు జోసెఫ్ కావ‌డం విశేషం.

అవార్డు రావ‌డం పై జోసెఫ్ మాట్లాడుతూ.. అవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచ వేదికపై ఇలాంటి అవార్డు రావడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో వెస్టిండీస్‌కు ఆడిన అనుభవంలోని ప్రతి క్షణాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను. ముఖ్యంగా గబ్బాలో చివరి రోజు మ్యాజిక్. నేను కష్టపడి పనిచేయడం కొనసాగించాలనుకుంటున్నాను. బంతితో వెస్టిండీస్ కోసం మరిన్ని మ్యాచ్ విన్నింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని అనుకుంటున్నాను. అవ‌స‌రం అయితే బ్యాట్‌తోనూ రాణించాల‌ని భావిస్తున్నాను అని జోసెఫ్ అన్నాడు.

IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు.. భార‌త్‌కు మ‌రో షాక్‌..!

అమీ హంట‌ర్

జింబాబ్వేలో సిరీస్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఐర్లాండ్ ప్లేయ‌ర్ అమీ హంట‌ర్.. ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి నెలలో ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం గౌరవంగా భావిస్తున్నాన్న‌ట్లు చెప్పుకొచ్చింది. జింబాబ్వేపై రెండు సిరీస్ విజయాలతో సంవత్సరానికి ఇది అద్భుతమైన ప్రారంభం. జట్టు విజయానికి దోహదపడగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. దానిని కొనసాగించాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పింది.