భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ సెర్చింగ్‌.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకేనా!

భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని అనువుగా ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది.

భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ సెర్చింగ్‌.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకేనా!

Pawan Kalyan

JanaSena Chief Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ నెల చివరినాటికి నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరుపార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే, త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : KCR Birthday : కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో చూడండి..

భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని అనువుగా ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ విషయంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే నాన్ లోక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. నాన్ లోకల్ అనే భావం ప్రజల్లో ఉండకుండా సొంత ఇంటిని నెలకొల్పుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారట. ఇప్పటికే కొన్ని ఇళ్ల ఫొటోలను పవన్ కల్యాణ్ కు స్థానిక జనసేన నేతలు పంపించారని, త్వరలోనే జనసేనాని ఇంటిని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

Also Read : AP Elections 2024: గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే?

గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో బరిలో నిలిచినప్పటికీ.. రెండు స్థానాల్లోనూ పవన్ కల్యాణ్ కు ఓటమి తప్పలేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో ఒక నియోజకవర్గం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. దీంతో భీమవరం నుంచే మరోసారి బరిలోకి దిగేందుకు జనసేనాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ స్థానికంగా సొంతింటికోసం దృష్టిసారించారు.