Demand House Sales : హైదరాబాద్‎లో జోరుగా ఇళ్ల అమ్మకాలు

Demand House Sales : నగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ప్లాట్ కొని ఇళ్లు కట్టుకోవడం.., కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు.

Demand House Sales : హైదరాబాద్‎లో జోరుగా ఇళ్ల అమ్మకాలు

Demand House sales In Hyderabad

Demand House Sales : దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ చక్కని గ్రోత్‌ సాధిస్తోంది. దీంతో హైదరాబాద్‌కు వలసలు భారీగా పెరిగాయి. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది హైదరాబాద్‌లో స్థిరపడాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ మహానగరంలో ఇళ్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. చిన్న చిన్న ఇళ్లతోపాటు లగ్జరీ విల్లాల వరకు.. ఇలా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే మార్కెట్లో చాలా డిమాండ్‌ ఉంది.

Read Also : Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఈస్ట్‌ హైదరాబాద్‌!

నగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ప్లాట్ కొని ఇళ్లు కట్టుకోవడం.., కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇక కాలనీల్లో ఉన్నావారు పెద్ద పెద్ద అపార్టుమెంట్లకు లేదా గేటెడ్ కమ్యూనిటీలకు మారుతున్నారు. ఇలా సిటీలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.

కొత్త ఇళ్లతో సమానంగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు :
తెలంగాణాలో గత ఏడాది 99 వేల 702 ప్రాపర్టీలు అమ్ముడుపోగా.. ప్రభుత్వ ఖజానాకు 2 వేల 364 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 50 వేల ప్రాపర్టీలు అమ్ముడు పోగా.. 18వందల 27 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇందులో పాత, కొత్త ఇళ్లు ఉన్నాయి. అయితే సిటీలో ఇళ్ల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు తమ ఆదాయానికి తగ్గట్లుగా కొత్త లేదా పాత ఇళ్ల ధరలను పోల్చుకొని కొనుగోలు చేస్తున్నారు. ఇక సిటీలో కొత్త నిర్మాణాల్లో ఎస్‌ఎఫ్‌టీ ధర 10 వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఉంది. అయితే కొత్త ప్రాపర్టీలతో పోలిస్తే పాత ఇళ్ల ధర కాస్త తక్కువగా ఉంది.

ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎస్‌ఎఫ్‌టీ ధర 5వేల నుంచి 10వేల వరకు ఉంది. ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో పాత, కొత్త ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. సిటీకి దూరంగా వెళ్లలేని వారిలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లలో భారీ పెరుగుదల నమోదైంది.

Read Also : Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‎లో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు