Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కి లీగల్ నోటీసులు పంపించడంపై.. ఎస్పీ చరణ్ లాయర్ కామెంట్స్..

'కీడా కోలా'లో బాలసుబ్రమణ్య వాయిస్‌‍ని AIతో ఉపయోగించుకున్నందుకు తరుణ్ భాస్కర్‌కి లీగల్ నోటీసులు పంపించిన ఎస్పీ చరణ్.

Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కి లీగల్ నోటీసులు పంపించడంపై.. ఎస్పీ చరణ్ లాయర్ కామెంట్స్..

sp charan sent legal notice to Tharun Bhascker for using SP Balasubrahmanyam AI voice in keedaa cola

Tharun Bhascker : టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి సింగర్ ఎస్పీ చరణ్ లీగల్ నోటీసులు పంపించారట. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని AI టెక్నాలజీ ద్వారా తన సినిమాలో ఉపయోగించుకున్నందుకు చరణ్.. ఈ పిటిషన్ ని వేసినట్లు సమాచారం. ఈ AI టెక్నాలజీని ఉపయోగించుకొని చనిపోయిన వారి వాయిస్ ని కూడా రీ క్రియేట్ చేస్తూ కొన్ని సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

మొదటిలో ఇలా రీ క్రియేట్ చేయడం అనేది అభిమానులు చేశారు. తమ అభిమాన సింగర్ ని గుర్తు చేసుకుంటూ ప్రేమతో ఫ్యాన్స్ ఆ పని చేశారు. కానీ ఆ తరువాత కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్.. తమ ప్రొఫిషనల్ యూజ్ కోసం ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా చేసిన వారిలో ఏ ఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఇటీవల ఓ సినిమా కోసం AIతో ఎస్పీబీ వాయిస్ ని ఉపయోగించుకున్నారు.

Also read : Dadasaheb Phalke International Film Festival Awards : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు.. బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ..

అయితే ఎస్పీబీ వాయిస్‌ని రెహమాన్ ఉపయోగించుకునే ముందు.. వారి కుటుంబసభ్యులు (ఎస్పీ చరణ్) పర్మిషన్ తీసుకున్నారు. కానీ తరుణ్ భాస్కర్ తన సినిమా ‘కీడా కోలా’లో బాలసుబ్రమణ్య వాయిస్‌‍ని.. ఎవరి పర్మిషన్ లేకుండా AIతో ఉపయోగించుకున్నారు. మూవీలోని ఓ సన్నివేశం బ్యాక్‌గ్రౌండ్ లో ఒక సాంగ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ పాటని AI ఎస్పీబీ వాయిస్‌తో క్రియేట్ చేశారు. ఇక ఈ పాట పై ఎస్పీబీ తనయుడు చరణ్ కోర్టులో పిటిషన్ వేశారు.

ఇక ఈ విషయం పై ఎస్పీ చరణ్ లాయర్ స్పందించారు. తరుణ్ భాస్కర్ అండ్ కీడా కోలా మూవీ టీం నుంచి క్షమాపణలు కోరుతూ.. రూ.1 కోటి రూపాయిలు ఫైన్ గా చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులు పంపించడానికి ముందు తరుణ్ అండ్ మూవీ టీంని ఈ ఇష్యూ పై సంప్రదించినప్పటికీ.. వారిని నుంచి సరైన జవాబు రాలేదట. దీంతో కోర్టు ద్వారా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.