Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌పై అశ్విన్ ‘సెంచ‌రీ’.. రాంచీలో అరుదైన ఘ‌న‌త‌

రాంచీలో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌పై అశ్విన్ ‘సెంచ‌రీ’.. రాంచీలో అరుదైన ఘ‌న‌త‌

Ashwin becomes first Indian bowler to pick 100 wickets against England

Ashwin : రాంచీలో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో (38) ను ఎల్బీగా ఔట్ చేయ‌డంతో అశ్విన్ ఓ మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొద‌టి భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. కాగా.. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల జాబితాలో అశ్విన్ అగ్ర‌స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇంగ్లాండ్ పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త ఆట‌గాళ్లు..

ర‌వి చంద్ర‌న్‌ అశ్విన్ – 100 వికెట్లు
బిఎస్‌ చంద్రశేఖర్ – 95
అనిల్ కుంబ్లే – 92
బిష‌న్ సింగ్‌ బేడి – 85
కపిల్ దేవ్ – 85
ఇషాంత్ శర్మ- 67

Also Read : ఏం చెప్పావురా..? దెబ్బ‌కు ప్యూజులు ఔట్ అయ్యాయి! షాహీన్ స‌మాధానానికి షాకైన అమీర్‌

టెస్టుల్లో ప్రత్యర్థిపై 1000 పరుగులు + 100 వికెట్లు తీసిన ఆట‌గాళ్లు వీరే..

అశ్విన్ మ‌రో రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఓ ప్ర‌త్య‌ర్థి పై 1000 ప‌రుగులు చేయ‌డంతో పాటు 100 వికెట్లు తీసిన జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.

– జార్జ్ గిఫెన్ vs ఇంగ్లాండ్‌
– మోనీ నోబుల్ vs ఇంగ్లాండ్‌
– విల్‌ఫ్రెడ్ రోడ్స్ vs ఆస్ట్రేలియా
– గార్ఫీల్డ్ సోబర్స్ vs ఇంగ్లాండ్‌
ఇయాన్ బోథమ్ vs ఆస్ట్రేలియా
స్టువర్ట్ బ్రాడ్ vs ఆస్ట్రేలియా
ఆర్ అశ్విన్ vs ఇంగ్లాండ్

అశ్విన్‌తో పోలిస్తే వీరిలో ఒక్క ఇయాన్ బోథ‌మ్ మాత్ర‌మే త‌క్కువ మ్యాచుల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. బోథ‌మ్ 22 మ్యాచుల్లోనే ఈ ఘ‌న‌త సాధించ‌గా అశ్విన్ కు 23 మ్యాచులు అవ‌స‌రం అయ్యాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. జోరూట్ (16), బెన్‌ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు. జాక్‌క్రాలీ (42) తృటిలో అర్ధ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. బెయిర్ స్టో (38) రాణించాడు. బెన్ డ‌కెట్ (11), ఒలి పోప్ (0), బెన్‌స్టోక్స్ (3) లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అరంగ్రేట ఆట‌గాడు ఆకాశ్‌దీప్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్‌, జ‌డేజాలు ఒక్కొ వికెట్ సాధించారు.

ఇప్ప‌టికే సిరీస్‌లో 1-2తో వెనుక‌బ‌డి ఉన్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం కీల‌కం. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.