పేదలకు ఓ న్యాయం, పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశాం : సీఎం జగన్

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలని, పేదలకు ఒకరకం నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదని 'సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

పేదలకు ఓ న్యాయం, పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశాం : సీఎం జగన్

CM Jagan

CM Jagan Mohan Reddy: ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో ఎన్. అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారి అన్నారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలని, పేదలకు ఒకరకం నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదని జగన్ అన్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చాం.. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు పేదలకు ప్రభత్వ బడులు.. డబ్బున్న వారికి ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియా చదువులు ఉండేవని, ఇప్పుడు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నామని జగన్ చెప్పారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ కంటెంట్ ను తీసుకొచ్చామని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన అందిస్తున్నామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని జగన్ అన్నారు.

Also Read : ఇంకా ఏమి కావాలి? షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా

వైద్య, ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ మోహన్  రెడ్డి చెప్పారు. గతంలో ధనికులకు మాత్రమే కార్పొరేట్ వైద్యం అందేంది.. ఇప్పుడు ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 25లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని జగన్ చెప్పారు. పేద మహిళల సాధికారత కోసం వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మఒడి పథకాలు తీసుకొచ్చామని జగన్ అన్నారు. గతంలో ఇలాంటి పథకాలు లేవు. పెత్తందారులు మాత్రమే నామినేటెడ్ పదవులు అనుభవించేవారు. ఇప్పుడు అన్ని వర్గాలకు పదవులు అందేలా చర్యలు చేపట్టామని, ముఖ్యంగా బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు వచ్చాయని జగన్ అన్నారు.

Also Read : Vyooham – Shapadham : మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ ‘వ్యూహం’.. ఈసారి నారా లోకేశ్ వల్ల కాదు..

గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించారా? చంద్రబాబు పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదలకు ఇంటి స్థలం ఇస్తుంటే అడ్డుకుంటూ కేసులు వేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలను అడ్డుకుంటూ 1191 కేసులు వేశారు. చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారు. వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగజారిని ఎలాగైనా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లేశ్వరపురం, ఎన్. అగ్రహారం, వెంగముక్క పాలెం, ఎరజర్ర గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా రూ. 210కోట్లు ఖర్చుచేసి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని, మరో 21 కోట్లు ఈ స్థలాల్లో లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేశామని జగన్ అన్నారు. 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే, పురాణాల్లో రాక్షసుల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు భార్యపై జగన్ సెటైర్లు..
ఎన్నికల వస్తుండటంతో మేము సిద్ధం అంటుంటే.. మరోవంక చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది.. ఏకంగా కుప్పంలోనే ఆమె అర్ధాంగినోటే పంచ్ డైలాగ్ లు వస్తున్నాయి. చంద్రబాబును చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్ధించని పరిస్థితి. చంద్రబాబుకు సమర్ధించేవారు ఎవరంటే.. ఏ నాడూ ఏపీకి రానివారు, ఏనాడూ ఏపీలో లేనివారు..  రాష్ట్రంలో ఓటు లేనివారు.. రాష్ట్రంలో దోచుకోవటం.. దోచుకున్నది పంచుకోవటం.. దీనికి అలవాటు పడిన వారు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి నాన్ రెసిడెన్స్ ఆంధ్రావాళ్ల మద్దతు లేదు.. దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ, మీఅందరిని కోరేది ఒక్కటే.. వైసీపీ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిఉంటే మీరే నాకు తోడుగా నిలవాలని ప్రజలను జగన్ కోరారు. పైన దేవుడిని నమ్ముకున్నాను.. కింద మిమ్మల్ని నమ్ముకున్నాను.. మధ్యలో బ్రోకర్లు, దళారులను నమ్ముకోలేదని జగన్ అన్నారు.