Delhi Capitals : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అత‌డే.. చిన్న‌ట్విస్ట్ కూడా ఉందిగా!

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఖారారైంది.

Delhi Capitals : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అత‌డే.. చిన్న‌ట్విస్ట్ కూడా ఉందిగా!

Rishabh Pant to lead Delhi Capitals in IPL 2024

Delhi Capitals – Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఖారారైంది. 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ అప్ప‌టి నుంచి ఆట‌కు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ నుంచి ఈ వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఐపీఎల్‌లో పంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం ధ్రువీక‌రించింది.

అంతేకాదండోయ్ ఢిల్లీ జ‌ట్టుకు పంత్ నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ తెలిపారు. మొద‌టి మ్యాచ్ నుంచే అత‌డు జ‌ట్టుకు సార‌థిగా ఉండాడ‌ని చెప్పాడు. ఏడు మ్యాచుల వ‌ర‌కు అత‌డు బ్యాట‌ర్‌, కెప్టెన్ సేవ‌లు అందిస్తాడ‌ని, వికెట్ కీపింగ్ చేయ‌డ‌ని అన్నారు. ఈ మ్యాచుల్లో పంత్ శ‌రీరం ఎలా స‌హ‌క‌రిస్తుందో చూసిన త‌రువాత మిగిలిన మ్యాచుల్లో అత‌డిని ఎంపిక చేయాలా వ‌ద్దా అనే విష‌యం పై ఆలోచించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

WPL 2024 : కింగ్ ఆఫ్ బాలీవుడ్‌తో క్వీన్ ఆఫ్ క్రికెట్.. వీడియో వైర‌ల్‌

“రిషబ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగెత్తుతున్నాడు. వికెట్ కీపింగ్ ప్రారంభించాడు. అతను ఐపీఎల్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది. రిషబ్ ఐపీఎల్ ఆడతాడని నేను ఆశిస్తున్నాను. అతను తొలి మ్యాచ్‌ నుండే నాయకత్వం వహిస్తాడు. మొదటి ఏడు మ్యాచ్‌లు అత‌డు ఓ బ్యాటర్‌గా మాత్రమే ఆడ‌తాడు. అత‌డి శ‌రీరం ఎలా స్పందిస్తుందో చూసిన త‌రువాత మిగిలిన ఐపీఎల్ కోసం తీసుకుంటాం.” అని జిందాల్ అన్నారు.

ఆండ్రీ నోర్ట్జే సైతం..

ద‌క్షిణాఫ్రికా స్టార్ పేస‌ర్ ఆండ్రీ నోర్ట్జే వెన్ను గాయం కారణంగా ఇటీవలి అనేక మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. అయితే అత‌డు ఫిట్‌నెస్ సాధించాడ‌ని ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్న‌ట్లు జిందాల్ చెప్పారు. 2020లో నార్ట్జే చేరినప్పటి నుండి అత‌డు క్యాపిటల్స్ లైనప్‌లో ఓ స్థిర‌మైన స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడ‌న్నారు. ఇప్పటి వ‌ర‌కు అత‌డు ఢిల్లీ త‌రుపున 53 వికెట్లు తీశాడ‌న్నారు. 2020 సీజన్‌లో 23.27తో 22 వికెట్లు సాధించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు.

రిష‌బ్ పంత్‌తో పాటు నోర్ట్జే లు తిరిగి ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. వీరిద్ద‌రితో పాటు అద్భుత‌మైన ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టు త‌మ‌ద‌ని చెప్పారు. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ వంటి ఆట‌గాళ్లు ఉండ‌డం జ‌ట్టుకు క‌లిసి వ‌స్తుంద‌న్నాడు.

Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌పై అశ్విన్ ‘సెంచ‌రీ’.. రాంచీలో అరుదైన ఘ‌న‌త‌