BJP 100 Candidates List : 100 మంది అభ్యర్థులతో సిద్ధమవుతున్న బీజేపీ.. తొలి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు?

BJP 100 Candidates List : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 100 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చేవారం రాబోయే తొలి జాబితాలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పేర్లను చేర్చనున్నట్టు సమాచారం.

BJP 100 Candidates List : 100 మంది అభ్యర్థులతో సిద్ధమవుతున్న బీజేపీ.. తొలి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు?

BJP

BJP 100 Candidates List : వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారి పార్టీ.. బీజేపీ అభ్యర్థుల విషయంలో ఆచూతూచీ అడుగులు వేస్తోంది.

Read Also : TDP Janasena 1st List : టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన

ఈ క్రమంలోనే వచ్చే వారం బీజేపీ తొలి జాబితాలో పేర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర కసరత్తు చేసిన కమలం పార్టీ.. ఈ వంద మంది జాబితాలో పార్టీ ముఖ్య నేతలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరి పేర్లను కూడా చేర్చనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఎన్డీయే కూటమి టార్గెట్ 400 సీట్లు :
ఈ నెల (ఫిబ్రవరి) 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 543 లోక్‌సభ స్థానాలకు గానూ 370 స్థానాలు గెలుపొందాలని అధికార పార్టీ భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ.. మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా కీలకం కానుంది.

ఇదివరకే, ప్రధాని మోదీ వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2014లో 3.37 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో మోదీ ఎన్నికయ్యారు. 2019లో 4.8 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం 2019 ఎన్నికలలో గాంధీనగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో ఈ లోకసభ స్థానం నుంచే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పోటీ చేశారు.

రాబోయే 100 రోజులు చాలా కీలకం : మోదీ పిలుపు 
గతవారమే ప్రధాని మోదీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలనే పార్టీ లక్ష్యాన్ని సాధించడానికి శ్రద్ధగా పని చేయాలని కోరారు. రాబోయే 100 రోజులు బీజేపీకి చాలా కీలకమని చెప్పారు. ‘రాబోయే 100 రోజుల్లో మనమందరం ప్రతి కొత్త ఓటరు, ప్రతి లబ్ధిదారుడు, ప్రతి వర్గానికి చేరువ కావాలి.

అందరి విశ్వాసాన్ని మనం గెలవాలి. ఎన్‌డీఎను 400 సీట్లతో గెలిపించడంతో పాటు బీజేపీ 370 (సీట్లు) మార్క్‌ను దాటాలి’ అని పార్టీ జాతీయ సదస్సులో ప్రధాని కోరారు. మూడోసారి అధికారం కోసం తాను ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. అయితే, దేశం కోసమే తాను పని చేయాలని భావిస్తున్నట్టు ప్రధాని పునరుద్ఘాటించారు.

Read Also : TDP Janasena First List : టీడీపీ- జనసేన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు నో చాన్స్‌