Sheeva Rana : గిల్లితే గిల్లించుకోవాలి.. ‘పోకిరి’ బోల్డ్ భామ గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?
పోకిరి సినిమాతో శివ రాణా బాగా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా సినిమా ఆఫర్లు రాలేదు ఈ ముంబై భామకు.
Sheeva Rana : టాలీవుడ్ లో పోకిరి(Pokiri) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) – ఇలియానా జంటగా వచ్చిన పోకిరి సినిమా టాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలుకొట్టేసింది. ఆ సినిమాతో మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ సినిమాలో సాంగ్స్ డైలాగ్స్ అన్ని పేలాయి. పోకిరి సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసింది శివ రాణా.
రౌడీ గ్యాంగ్ లో ఉండే రౌడీ అమ్మాయిలా, మహేష్ బాబు మీద ఇష్టంతో చూసే బోల్డ్ అమ్మాయిలా, పబ్ సీన్ లో ప్రకాష్ రాజ్ పక్కన కూర్చునే అమ్మాయిగా కనిపించిన నటి శివా రాణా. పబ్ సీన్ లో ప్రకాష్ రాజ్ గిచ్చితే.. గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు అనే డైలాగ్ ప్రకాష్ రాజ్ చెప్పింది అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ సీన్ తో, పోకిరి సినిమాతో శివ రాణా బాగా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా సినిమా ఆఫర్లు రాలేదు ఈ ముంబై భామకు.
Also Read : Mohan Babu : అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన మోహన్ బాబు..
పోకిరి తర్వాత, ధగడ్ సాంబ, దేవుడు చేసిన మనుషులు, మెహబూబా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఎక్కువ సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఛాన్సులు వచ్చినప్పుడే సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తూ ప్రస్తుతానికి యోగా టీచర్ గా సెటిల్ అయిపొయింది. శివ రాణా ప్రస్తుతం ముంబైలోనే ఉంటూ యోగా టీచర్ గా వర్క్ చేస్తుంది. ఈ అమ్మడికి 35 ఏళ్ళ పైనే ఉంటాయి. ఇంకా పెళ్ళి చేసుకోలేదని సమాచారం. అయినా యోగా టీచర్ కావడంతో అప్పుడు ఎలా అందో ఇప్పటికే అదే బాడీని మెయింటైన్ చేస్తూ వస్తుంది శివ రాణా.
View this post on Instagram
సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫొటోలు, యోగా ఫొటోలు, తన షూట్ అప్డేట్స్ షేర్ చేస్తుంది శివ రాణా. ఈ భామని ఇప్పుడు చూసి తెలుగు ఆడియన్స్ సినిమాల్లోకి తీసుకోండి ఇంకా అంతే అందం మెయింటైన్ చేస్తుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ముంబై భామ మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram