Rohit Sharma : ఆ ఘ‌నత సాధించిన తొలి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే..

బ‌జ్‌బాల్ ఆట మొద‌లెట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్క‌సారి కూడా ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోలేదు. తాజాగా రోహిత్ శ‌ర్మ మొద‌టి ఓట‌మిని రుచి చూపించాడు.

Rohit Sharma : ఆ ఘ‌నత సాధించిన తొలి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే..

Rohit Sharma

Rohit : టెస్టుల్లో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌, కోచ్‌గా మెక్‌క‌ల‌మ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆ జ‌ట్టు ఆట‌తీరు మారిపోయింది. బ‌జ్‌బాల్ అంటూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను హ‌డ‌లెత్తిస్తూ వ‌స్తోంది. ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా బాదుడే ల‌క్ష్యంగా ఆడుతోంది. ఈ క్ర‌మంలోనే న్యూజిలాండ్‌, పాకిస్థాన్ జ‌ట్ల పై బ‌జ్‌బాల్ గేమ్‌తో సంచ‌ల‌న విజ‌యాలు అందుకుంది. కాగా.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన యాషెస్ సిరీస్‌ను మాత్రం స‌మం చేసింది. అయితే.. బ‌జ్‌బాల్ ఆట మొద‌లెట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్క‌సారి కూడా ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోలేదు. తాజాగా రోహిత్ శ‌ర్మ మొద‌టి ఓట‌మిని రుచి చూపించాడు.

బ‌జ్‌బాల్ గేమ్‌తో భార‌త్‌లోనూ సిరీస్ గెలుస్తామ‌ని టెస్టు సిరీస్‌కు ముందు కెప్టెన్ స్టోక్స్‌, కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ ల‌తో పాటు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు కామెంట్లు చేశారు. అయితే.. భార‌త్‌లో బ‌జ్‌బాల్ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోయింది. బ‌జ్‌బాల్ యుగం మొద‌లైన‌ప్ప‌టికీ ఇంగ్లాండ్ ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో టెస్ట్ సిరీస్‌లో బాజ్‌బాల్ ఎరాను ఓడించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

Virat Kohli : ఇంగ్లాండ్ పై సిరీస్ విజ‌యం.. కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

వాస్త‌వానికి హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది. 0-1తో వెనుక‌బ‌డిపోయింది. అయితే.. ఆ త‌రువాత టీమ్ఇండియా బ‌లంగా పుంజుకుంది. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌తో పాటు రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ ద్విశ‌త‌కాలు బాదాడు. పేస‌ర్ బుమ్రా, స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్‌లు స‌మ‌యోచితంగా రాణిస్తూ వికెట్లు తీస్తూ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. అటు ఈ సిరీస్‌లోనే అరంగ్రేటం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురెల్ లు అంచ‌నాల‌కు మించి రాణిస్తున్నారు.

కాగా.. సొంత గ‌డ్డ‌పై భార‌త్‌కు ఇది వ‌రుస‌గా 17వ టెస్టు సిరీస్ విజ‌యం. ఈ ఘ‌న‌త సాధించి మొద‌టి జ‌ట్టుగా టీమ్ఇండియా నిలిచింది. 2012లో అలిస్ట‌ర్ కుక్ సార‌థ్యంలోని ఇంగ్లాండ్‌తో భార‌త్ 2-1తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆ త‌రువాత నుంచి జ‌రిగిన సిరీస్‌ల్లో ఒక్క‌దానిలోనూ భార‌త్ ఓడిపోలేదు. అన్నింటిలో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

Hanuma Vihari: ఇకపై ఆంధ్రా జట్టు తరఫున ఆడ‌ను.. సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన హ‌నుమ విహారి