Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..
తాజాగా రామ్ చరణ్ - మహేంద్ర సింగ్ ధోని ఒకే ఫ్రేమ్ లో కనపడి అలరించారు.
![Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో.. Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..](https://10tv.in/wp-content/uploads/2024/03/dhoni-charan.jpg)
Ram Charan and Mahendra Singh Dhoni in One Frame Video goes Viral
Ram Charan – Dhoni : ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లో గత మూడు రోజులుగా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకకి దేశ విదేశాల నుంచి ఎంతోమంది బిజినెస్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మన దేశంలోని ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ – ఉపాసన మాత్రమే అనంత్ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. దీంతో రెండు రోజులుగా చరణ్ – ఉపాసన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నార్త్ లో చరణ్ ని చూసి అక్కడి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా చరణ్ ని అక్కున చేర్చుకొని మాట్లాడుతున్నారు. చరణ్ ని చూసి జై శ్రీరామ్ అంటూ అక్కడి ప్రజలు చేసిన నినాదాలు వైరల్ అయ్యాయి.
Also Read : Varalaxmi Sarathkumar : పెళ్లిపీటలు ఎక్కబోతున్న లేడీ విలన్.. నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..
తాజాగా రామ్ చరణ్ – మహేంద్ర సింగ్ ధోని ఒకే ఫ్రేమ్ లో కనపడి అలరించారు. వాళ్ళు బస చేసిన హోటల్ లో బయటకి వచ్చేటప్పుడు రామ్ చరణ్ – ఉపాసన, ధోని – సాక్షి, మరికొంతమంది కలిసి నడుస్తూ వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చరణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ధోని – చరణ్ ని ఇలా ఒకేసారి చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చరణ్ దంపతులు బాగానే వైరల్ అవుతున్నారు.
The Man Of Masses & Mahi Bhai Union at #AnantRadhikaWedding Festivities ❤️🔥❤️🔥#GameChanger's@AlwaysRamCharan 🦁@msdhoni 🦁 pic.twitter.com/xvaM1NqExi
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 3, 2024