Businessman : ‘బిజినెస్‌మెన్’ సినిమా ఆ హీరో చేయాల్సింది.. కానీ మహేష్ కథ వినకుండానే.. కథ కూడా పూరీది కాదు..

పూరి జగన్నాధ్ - మహేష్ బాబు కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మెన్.

Businessman : ‘బిజినెస్‌మెన్’ సినిమా ఆ హీరో చేయాల్సింది.. కానీ మహేష్ కథ వినకుండానే.. కథ కూడా పూరీది కాదు..

Mahesh Babu Puri Jagannadh Businessman Movie Untold Story Interesting Facts

Businessman : పూరి జగన్నాధ్(Puri Jagannadh) – మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మెన్. ఈ సినిమా పోకిరి అంత కాకపోయినా మంచి విజయమే సాధించింది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ముంబైలో ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని అంతం చేసి, ముంబైలో డాన్ అనేవాడు లేదు అని ప్రకటిస్తాడు. అప్పుడు ముంబైలో సూర్య భాయ్ అనే ఓ కొత్త డాన్ ఎంటర్ అయి దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ పాయింట్ మీదే బిజినెస్‌మెన్ సినిమా తీసారు.

ఈ సినిమాలో సూర్య భాయ్ క్యారెక్టర్ హైలెట్. ఆ క్యారెక్టర్ వల్లే సినిమా హిట్ అయింది. అయితే ఈ కథ కోర్ పాయింట్ పూరీది కాదు. సినిమా కూడా ముందు మహేష్ తో అనుకోలేదు. రక్తచరిత్ర 2 సినిమా షూట్ లో ఉన్నప్పుడు ఆర్జీవీకి ఈ కథ ఆలోచన వచ్చింది. ఈ లైన్ ని రక్తచరిత్ర సినిమా షూట్ లోనే తమిళ్ హీరో సూర్యకి చెప్పాడు ఆర్జీవీ. లైన్ నచ్చి డెవలప్ చేయమన్నాడు సూర్య. దీంతో ఈ లైన్ చెప్పి తన శిష్యుడు పూరీని డెవలప్ చేయమన్నాడట ఆర్జీవీ. పూరికి కూడా నచ్చడంతో ఆర్జీవీ చెప్పిన డాన్ కథని పూరి బిజినెస్‌మెన్ గా రాసాడు.

తర్వాత ఆ సినిమాని ఆర్జీవీ పూరినే డైరెక్ట్ చేసుకోమన్నాడు. దీంతో పూరి జగన్నాధ్ సూర్యకి కథ మొత్తం చెప్పాడు. సూర్యకు కూడా నచ్చి చేద్దాం అన్నాడు. కానీ సూర్య అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో మహేష్ తో చేద్దామని అడిగితే మహేష్ కథ కూడా వినకుండా పోకిరి లాంటి పెద్ద హిట్ ఇచ్చాడనే నమ్మకంతో పూరికి సినిమా ఓకే చేసేసాడు.

Mahesh Babu Puri Jagannadh Businessman Movie Untold Story Interesting Facts

సమ్మర్ లో ఈ సినిమాని ప్రకటించి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ సెప్టెంబర్ దాకా మొదలుపెట్టకపోవడంతో సంక్రాంతికి ఈ సినిమా రాదనుకున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి 74 వర్కింగ్ డేస్ లో ఈ సినిమాని పూర్తిచేశారు. మహేష్ సినిమా అంతా కథే వినకుండా కేవలం సీన్స్, డైలాగ్స్ విని నటించాడు. అనుకున్నట్టు సంక్రాంతికి 2013 జనవరి 13న విడుదల చేసారు బిజినెస్‌మెన్ సినిమాని. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత హిట్ అయింది. 40 కోట్లతో సినిమా తీస్తే 90 కోట్లు వచ్చాయి. అలా మహేష్ కెరీర్ లో మంచి మాస్ క్యారెక్టర్ తో మరో హిట్ పడింది. పూరి – మహేష్ కాంబోని ముచ్చటగా మూడోసారి చూడాలనుకుంటున్నారు అభిమానులు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.

Also Read : Janhvi Kapoor : అంబానీ ఇంట పెళ్లి వేడుక.. సందడి అంతా జాన్వీ కపూర్‌దే..

ఇలా ఆర్జీవీ చెప్పిన స్టోరీ లైన్ ని పూరి జగన్నాధ్ డెవలప్ చేసి సూర్యకి వినిపిస్తే నచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో మహేష్ తో చేసి బిజినెస్‌మెన్ హిట్ కొట్టారు పూరి.