Janhvi Kapoor : రామ్ చరణ్ సినిమాలోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసిన జాన్వీ..

రామ్ చరణ్ బుచ్చిబాబు RC16 సినిమాలోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.

Janhvi Kapoor : రామ్ చరణ్ సినిమాలోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసిన జాన్వీ..

Janhvi Kapoor officially entered into Ram Charan RC16 movie

Janhvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నేడు (మార్చి 6) తన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. దీంతో ఆమె అభిమానులు, ఫిలిం మేకర్స్ ఆమె విషెస్ తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ బహుమతులుగా వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన జాన్వీ కపూర్.. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం తరువాత రామ్ చరణ్, బుచ్చిబాబు RC16లో కూడా నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జాన్వీ తండ్రి బోణి కపూర్.. ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ కామెంట్స్ చేసారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం అఫీషియల్ వెల్కమ్ రాలేదు. తాజాగా ఆ స్వాగతం బర్త్ డే కానుకగా వచ్చేసింది. RC16 చిత్ర నిర్మాతలు జాన్వీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. మూవీ యూనిట్ లోకి వెల్కమ్ పలికారు.

Also read : Sharwa35 : శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది..

గత జనరేషన్ లో చిరంజీవి, శ్రీదేవి జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు వారి వారసులైన రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తుండడంతో ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తుంది. మరి వెండితెర పై ఈ జంట.. ఆ సక్సెస్‌ఫుల్ జంటని మైమరపిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తుంటే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కథతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో మూవీ రూపొందునుందట.