Premikudu : రీ రిలీజ్ మూవీని భారీ రేటుని కొనుగోలు.. లేటెస్ట్‌గా వస్తున్న ‘ప్రేమికుడు’..

అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పోటీ కనిపిస్తుంది. రీ రిలీజ్ లో కూడా 'ప్రేమికుడు' హవా..

Premikudu : రీ రిలీజ్ మూవీని భారీ రేటుని కొనుగోలు.. లేటెస్ట్‌గా వస్తున్న ‘ప్రేమికుడు’..

Shankar Prabhu Deva Nagma Premikudu re release update

Premikudu : టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమికుడు’ని భారీ ధర ఇచ్చి మరి కొనుగోలు చేసి రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ప్రభుదేవా, నగ్మా హీరోహీరోయిన్స్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. 1994లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మూడు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ఈ సినిమాని అప్పటిలో తెలుగులో రిలీజ్ చేసేందుకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో పోటీని ఎదుర్కొన్నారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పోటీ కనిపిస్తుంది. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు.. ఇక్కడికి మేకర్స్ పోటీ పడుతున్నారు. సి ఎల్ ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మురళీధర్ రెడ్డి మరియూ రమణ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు.. ఎంతో కాంపిటీషన్ మధ్య అధిక ధర చెల్లించి రీ రిలీజ్ రైట్స్ ని సొంత చేసుకున్నారు.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ పై దిల్ రాజు కామెంట్స్.. రామ్ చరణ్ బర్త్ డేకి..

ఈ మూవీ రీ రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి రీ రిలీజ్ లో కూడా ఎంతో కంపిటిషన్ ని చూపించిన ప్రేమికుడు.. థియేటర్స్ లో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. కాగా ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ రీ రిలీజ్ తో థియేటర్స్ మరోసారి మ్యూజిక్ కాన్సర్ట్ కాబోతున్నాయి.

కాగా ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ‘జెంటిల్ మెన్’ సినిమా తరువాత శంకర్ ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని భావించారు. ఈక్రమంలోనే ధనవంతురాలైన అమ్మాయి, పేదవాడైన అబ్బాయి మధ్య ఓ ప్రేమ కథని రాసుకున్నారు. అయితే ఈ స్టోరీలోనే తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన ఓ అంశాన్ని కూడా జోడించారు. ఆ సమయంలో తమిళనాడు సీఎం అండ్ గవర్నర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. ఆ విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తూ స్టోరీని డెవలప్ చేసారు.