Dhanush : మహా శివరాత్రి నాడు ‘కుబేర’.. బిచ్చగాడిలా ధనుష్..

తాజాగా నేడు మహాశివరాత్రి సందర్భంగా శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేశారు.

Dhanush : మహా శివరాత్రి నాడు ‘కుబేర’.. బిచ్చగాడిలా ధనుష్..

Sekhar Kammula Dhanush Nagarjuna Movie First Look and Title Released

Dhanush : నాగార్జున ఇటీవల నా సామిరంగ(Naa Saami Ranga) సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) – ధనుష్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సర్ సినిమాతో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి భారీ హిట్ కొట్టి ఇప్పుడు ఇంకో డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. #DNS వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం థియేటర్స్ లోకి వస్తుందని సమాచారం.

తాజాగా నేడు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘కుబేర’ అనే టైటిల్ ప్రకటించారు. కానీ ధనుష్ గెటప్ మాత్రం బిచ్చగాడిలా ఉంది. ధనుష్ వెనుక శివుడు, అన్నపూర్ణాదేవి ఫోటో ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై ఆసక్తి కలుగుతుంది.

Also Read : Mahesh Babu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్ళీ మహేష్ బాబు.. కానీ ఈ సారి..

ఇప్పటివరకు శేఖర్ కమ్ముల సినిమాలు అంటే క్యూట్ లవ్ స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ తో మొదటిసారి శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి తీయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ధనుష్ ‘కుబేర’గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాని తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.