IND vs ENG : అయ్యో జానీ.. కుర్రాళ్ల‌తో ఎందుకు పెట్టుకున్నావ్‌.. ఇప్పుడు చూడు ఏమైందో.. కొన్ని ప‌రుగులు చేశావ‌ని ఎగిరిప‌డుతున్నావ్‌..

ధ‌ర్మ‌శాల టెస్టులో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు త‌మ నోటికి ప‌ని చెప్పారు. తాము ఏం త‌క్కువ కాదంటూ టీమ్ఇండియా యువ క్రికెట‌ర్లు ధీటుగా స‌మాధానం ఇచ్చారు.

IND vs ENG : అయ్యో జానీ.. కుర్రాళ్ల‌తో ఎందుకు పెట్టుకున్నావ్‌.. ఇప్పుడు చూడు ఏమైందో.. కొన్ని ప‌రుగులు చేశావ‌ని ఎగిరిప‌డుతున్నావ్‌..

IND vs ENG 5th Test : స్వ‌దేశంలో భార‌త్‌ను ఓడించ‌డం అంత సులువు కాద‌ని ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌కు ఈ పాటికే అర్థ‌మై ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆఖ‌రి టెస్టులోనైనా గెలిచి ప‌రువు ద‌క్కించుకుని వెళ్లాల‌ని భావించారు ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు. అది నెర‌వేర‌లేదు. ఈ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే.. ధ‌ర్మ‌శాల టెస్టులో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు త‌మ నోటికి ప‌ని చెప్పారు. తాము ఏం త‌క్కువ కాదంటూ టీమ్ఇండియా యువ క్రికెట‌ర్లు ధీటుగా స‌మాధానం ఇచ్చారు.

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్‌, టీమ్ ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ ల మ‌ధ్య రెండో రోజు మొద‌లైన మాట‌ల యుద్ధం మూడో రోజు ఆట‌లో కొన‌సాగింది. మూడో రోజు టీమ్ఇండియా యువ ఆటగాళ్లు వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టోను ల‌క్ష్యంగా చేసుకున్నారు. అత‌డి ఏకాగ్ర‌త‌ను దెబ్బ తీశారు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో ఆ త‌రువాతి బంతికే ఔట్ కావ‌డం విశేషం.

SunRisers Hyderabad : అక్క‌డ రెండు టైటిల్స్‌ గెలిచిన జెర్సీతో ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌.. నెట్టింట సెటైర్లు!

అస‌లే జరిగిందంటే?

రెండో రోజు గిల్, అండ‌ర్స‌న్ ల‌ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. గిల్ ను ఔట్ చేసిన త‌రువాత అండ‌ర్స‌న్ చాలా దూకుడుగా సంబ‌రాలు చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో బెయిర్ స్టో బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో స్లిప్‌లో గిల్ ఉన్నాడు. లెగ్‌స్లిప్‌లో స‌ర్ఫ‌రాజ్ ఉన్నాడు. వీరి మ‌ధ్య ఇలా మాట‌ల యుద్ధం సాగింది.

అలసిపోవడం గురించి జిమ్మీ(అండ‌ర్స‌న్‌)తో నువ్వేం అన్నావు? ఆ తర్వాతే నిన్ను ఔట్‌ చేశాడు కదా? అని బెయిర్ స్టో అన్నాడు. ఏదైతేనేమీ అప్ప‌టికే సెంచ‌రీ కొట్టాను గ‌దా..? ఇప్పుడు నువ్వు ఎన్ని ప‌రుగులు చేశావు అని గిల్ ప్ర‌శ్నించాడు. నువ్వు ఏం సాధించావు, ఇక్క‌డితో ఆపు అని బెయిర్ స్టో అన‌గా.. నువ్వు మ్యాచ్ చూడ‌లేదా.? గిల్ ఎలా ఆడాడో అని ధ్రువ్ జురెల్ అన్నాడు.

అదే స‌మ‌యంలో గిల్ క‌ల్పించుకుని నిన్ను ప్ర‌తీ భార‌త బౌల‌ర్ ఔట్ చేస్తాడు. కుల్దీప్ నీ కంటే చ‌క్క‌గా బ్యాటింగ్ చేశాడు. నీ వికెట్ సైతం తీయ‌గ‌ల‌డు అని అన్నాడు. ఈ గ్యాప్‌లో స‌ర్ఫ‌రాజ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ రోజు ఏదో కొన్ని ప‌రుగులు చేశాడు. దానికే ఎగిరిప‌డుతున్నాడు అంటూ బెయిర్ స్టోను ఉద్దేశించి అన్నాడు.

IND vs ENG 5th test : ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం..

ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 39 ప‌రుగులు చేశాడు. ఈ వాగ్వాదం జ‌రిగిన త‌రువాత బంతికే కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.